Others

ఆ ‘బార్’కు దారేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవాలక్ష సమస్యలకి అనంత కోటి ఉపాయాలంటారు. అలాగా, ఇటీవల సుప్రీంకోర్టు వారు హైవేరోడ్డుకి జాతీయ రహదారులకి కూడా కనీసం ఐదు వందల మీటర్ల దూరంలో ‘బార్లు,వినోద దుకాణాలు దూరంగా ఉండాలి. అంతకన్నా దగ్గరగా వున్న ‘బార్’లు గాని మద్యం సరఫరా దుకాణాల్ని అన్నింటినీ మూసివేయాలని తీర్పు చెప్పారు.
దేశంలో ఏటా కనీసం లక్షన్నర రోడ్డు ఏక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటికి కారణం ఏమిటయ్యా? అని ఆరా తీస్తే, ఎక్కువ భాగం మానవాంతక రోడ్డు ప్రమాదాలు- తప్పతాగిన డ్రైవర్‌లు కండకావరంతో బండ్లు త్రోలడమేనని తేలింది. కొంతలో కొంత ఈ జాడ్యం తగ్గాలీ అంటే మార్గమధ్యంలో ‘మందు’ లభించకుండా చూడటమేననుకున్న న్యాయస్థానం హైవేలు, నేషనల్ హైవేలని హద్దులుగా తీసుకున్నది. అయితే ‘బార్’ ఓనర్‌లు, మందు భాయిలు కూడా చట్టాన్ని, లోకాన్ని కూడా ఎక్కువగానే చదివారు.
బార్‌లు ఐదువందల మీటర్‌లకి రోడ్డుకు అవతల వుండొచ్చునూ అంటే అయిదు వందల మీటర్లు అంటే అర కిలోమీటరు నడిస్తే గాని లేదా శకటం తోలుకుంటూ పోతేగాని ‘బార్’ వాసన- ‘బార్’ స్వర్గద్వారం తగలకూడదు అనేగా అర్థం. ఓస్! అంతేనా? ‘విల్’ ఎక్కడుందో ‘వే’ అక్కడ ఉంటుంది అనుకుంటూ కేరళలోని ‘పారావూరు’ (ఎర్నాకుళం)లో వున్న ఐశ్వర్యా రెస్టోబార్ యజమాని- ఒక ‘దూరం దారి’ (అడ్డదారికి బదులుగా) కనిపెట్టాడు. నేషనల్ హైవేకి సరిగ్గా ఐదు వందల మీటర్‌లూ కొలుచుకుంటూ వెళ్ళే ఒక మెళికల మలుపుల పద్మవ్యూహం లాంటి రోడ్డును రెండు లక్షల రూపాయలతో నిర్మించాడు. ఒక మనిషైనా, వాహనమైనా ఐశ్వర్య బార్ చేరాలంటే కడుపులో పేగులు తిరిగేలా ఒళ్లు వానా వానా చల్లప్పా తిరిగిన తరువాత తిరిగినట్లు తిరిగితే తప్ప పోలేరు. ‘దారి’ కాదు ముఖ్యం. కోర్టువారి ఆదేశంలో దూరం ముఖ్యం. ఇది చూసి ‘సైబర్ హబ్’, ఏంబియన్స్ మాల్ బాస్‌లు కూడా అనన్య వింత మార్గాలు త్రొక్కారు (నిర్మించారు).
‘సైబర్’కి పోవాలంటే నేషనల్ హైవే నుంచి దాన్ని చూడవచ్చును గాని (యిది గురుగాంవ్‌లో వుంది) కిలోమీటర్ దూరం ఒంపుల దారి అధిగమిస్తే గాని చేరలేం. ‘బార్’ వెనుకకి పోయి యిండ్ల మధ్య నుంచి మెలికలు త్రిప్పే దారిని తయారుచేశారీ మేధావులు. ముక్కేదిరా! అంటే చెవి వెనుకనుంచి చూపెట్టినట్లు- ఏ దుర్యోధనుడయినా మామూలు సభా మార్గాన తూలిపడిపోతే? అదే అతగాడికి డోస్ ఎక్కువైందనడానికి కొలబద్ద అన్నారు. తిరిగి భద్రంగా హైవేకి చేరుకున్నవాడే అర్జునుడు- అంటే రీ బార్ వాసులు!