Others

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాక్లెట్లు, క్యాండీల వంటి ఆహార పదార్థాలను రకరకాల ఆకారాల్లో తయారుచేసుకోవడం మొదలుకొని.. సుదూర గ్రహాలపై ఆవాసాలను నిర్మించేందుకు ఉన్న అవకాశాల వరకూ అన్నింటిలోనూ త్రీడీ ప్రింటింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. హాలెండ్‌లోని ఓ డాక్టర్ల బృందం మనిషి పుర్రెలో కొంత భాగానికి ప్రయత్నామ్నాయాన్ని ఈ పద్ధతిలో ప్రింట్ చేసి వాడింది. అంతేకాదు శరీరంలోని ఎముకలు, కీళ్లను కూడా కృత్రిమంగా తయారుచేసేందుకు త్రీడీ ప్రింటింగ్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇప్పటి పరిశోధకులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. త్రీడీతో చర్మ, గుండె ఒకటేమిటి మానవ శరీరంలోని ప్రతి భాగాన్నీ పునర్ నిర్మించుకోవచ్చు. త్రీడీ ప్రింటర్‌తో ఒంటిమీద చర్మాన్ని ప్రింట్ చేసుకునే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. లండన్ వైద్య నిపుణులు ఓ మహిళకు సహజమైన పుర్రె స్థానంలో త్రీడీ పుర్రెను అతికించారు. శరీర అవయవాలను కూడా పరిశోధనశాలల్లో ప్రింట్ చేసుకుని వాడవచ్చునని, ఇప్పటికే కణజాలంతోపాటు కొంతమేరకు రక్తనాళాలను కూడా త్రీడీ ప్రింటింగ్ సాయంతో తయారుచేస్తున్నారు.