Others

పగటి నిద్ర మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహజ సిద్ధంగా మనుషులలో రజో, సాత్విక, తమో గుణాలు ఉంటాయి. రజోగుణం ఉన్నప్పుడు మనలో శారీరక జీవనక్రియలు జరగడంతోపాటు, మనలో సృజనాత్మక చైతన్యం వెల్లివిరుస్తుంది. సత్వ లేక సాత్విక గుణం వలన ప్రశాంతత కలుగుతుంది. ఈ సమయంలో మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ ప్రశాంతంగా ఉంటాయి. తమోగుణం సమయంలో మనోవికారాలతోపాటు, వికృత భావాలు, భయాందోళనలు కలుగుతాయి. అందరిలో ఉదయం నాలుగు గంటలనుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రజోగుణం, సాయంత్రం నాలుగు గంటల నుంచి సూర్యాస్తమయం వరకు సాత్విక గుణం, సూర్యాస్తమయం నుంచి ఉదయం నాలుగు గంటల వరకు తమోగుణం సహజ సిద్ధంగా ఉంటాయి. అందువల్లనే మన పెద్దలు సత్వగుణ కాలంలో మేల్కొని ఉండి, రజోగుణ కాలంలో పనులు చేసుకొంటూ, తమోగుణకాలంలో నిద్రించాలి అని చెప్పారు.
బుల్లితెర భూతం (టెలివిజన్) నట్టింట్లో తిష్టవేసిన తరువాత, అర్థరాత్రివరకు మేల్కొని ఉండటం సర్వసాధారణం అయింది. దీంతో, పలువురు పగటి పూట నిద్రపోతున్నారు. సూర్యోదయం తరువాత సూర్యరశ్మి కారణంగా తమోగుణం నశించి శరీరంలో చైతన్యశక్తులు వెల్లివిరుస్తాయి. అయితే పగటిపూట నిద్రించడంవలన, శరీరంలో చైతన్యం నశిస్తుంది. వాతం పెరిగిపోయి శరీరం రోగగ్రస్తం అవ్వడానికి కారణమవుతుంది. అంతేకాకుండా, మానసిక, శారీరక బలహీనతలు కలగడం, శరీరంలో క్రొవ్వు పెరగడం, అజీర్ణ వ్యాధులు (మలబద్ధకం, గ్యాస్‌ట్రబుల్ తదితర) బుద్ధి మాంద్యం ఏర్పడుతుంది.
సూర్యాస్తమయం తరువాత (తొందరగా) నిద్రిస్తే మనస్సు, ఇంద్రియాలు ఉదయానికి సేదదీరి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పనిచేస్తాయి.
అయితే, రాత్రి పూట పనిచేసేవారు (నైట్ డ్యూటీలు) దూర ప్రయాణాలు చేసిన వారు మధ్యాహ్నం భోజనానికి ముందు నిద్రించవచ్చు. పూర్వకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులు తప్ప మిగిలిన వారు ఎవరూ మధ్యాహ్నం నిద్రించేవారు కాదు. అందువల్లనే మన పెద్దలు వృద్ధాప్యంలో సైతం చలాకీగా ఉండగలిగారు. శాస్ర్తియంగా చూస్తే, పగటిపూట నిద్ర మనకు మంచిది కాదు అన్న విషయం తేటతెల్లం అవుతున్నది.

- పి.మస్తాన్‌రావు