Others

మేకల్ని మేపలేక మొర్రోమంటున్న పోలీసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మంగ చిక్కిన మీ మేకలయితే పోనీ అమ్మేసేవారు- అప్పనంగా చిక్కిన మేకలయితే కోసుకుతినేసేవారు. కాని అక్రమ మాంసం దుకాణంమీద గొప్పగా రైడ్ చేసి కొట్టుకొచ్చిన సొమ్ములు కావడంతో జార్ఖండ్ రాష్ట్రంలోని నగరి పోలీసులు బాధ ఒకరికి చెప్పుకోలేక అల్లాడుతున్నారు. ఈమధ్య యుపిలోలాగే జార్ఖండ్ రాష్ట్రంలో పోలీసు దాడులలో మూడువేలమంది మాంసం దుకాణదారులు అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళల్లో ఒకడు నగరికి చెందిన బాబులు మస్మన్సూర్‌ఖాన్. అతని మీట్ షాపు మీద పోలీసులు దాడి చేసి ఇరవై ఎనిమిది మేకల్ని- మంచి బలంగా వున్నవాటిని పట్టుకున్నారు. తెచ్చి పోలీసు స్టేషన్‌లో పెట్టుకున్నారు. వాటిని బయటికి తీసుకెళ్లి మేపుకురావాలి కదా? ఓ వారం రోజులు మేకల కాపరిగా కానిస్టేబుల్‌ని పంపించారు. అసలే సిబ్బంది తక్కువ- పైగా మేకల కాపరి పని అంటే జనం ఏడ్పిస్తున్నారు. కాని మేకల్ని సివిల్ కోర్టులో హాజరుపరిచి- ఓనరు వచ్చి జామీను తీసుకున్నాకాగాని వదలకూడదు. అంచేత, స్థానికంగా వున్న వ్యాపారి బంటీ గుప్తని మొహమాటపెట్టి- అతనికి మేకల్ని జాగ్రత్తగా చూడమని మేపమని చెప్పారు. ఏదో రెండు మూడు రోజులనుకున్నాను గానీ మే ఇరవై ఐదో తారీఖుదాకా నేను భరించలేను బాబోయ్! వాటి పెంటికల బాధ మరీ ఎక్కువగా ఉంది. నా వ్యాపారం దెబ్బతినేసింది అని గుప్తా గోల. కానీ కోర్టువారు విచారణకి ఆ తారీఖు ఇచ్చారు. అప్పుడు బెయిలు తీసుకొనే మరీ వాటిని వదలాలి. ఈలోగా నేను గడ్డి తింటున్నాను తిండి లేక అని మేకల యజమాని అక్రమ మాంసం దుకాణదారు పోలీసు స్టేషన్ ముందు నన్ను కూడా మేపండి అన్నట్లు చక్కర్లు కొడుతున్నారు. మేకతోకకిమేకతోకకిమే అన్నట్లుంది అధికారుల గోడు.