Others

అమ్మయనా పరుగులో మేటి ! వార్త-వ్యాఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయిన ఆదివారం చండీగఢ్‌లో జరిగిన ‘మదర్స్ డే’ సంబరాల్లో మరో యాభై మంది వనితలతో కలిసి ప్రదర్శన వేదిక మీద అద్భుతంగా నడిచిన శ్రీమతి మాన్ కౌర్ వీక్షకులను ‘కిర్రె’క్కించేసింది.. ఈ బామ్మగారు పరుగుపందెం వేస్తానంటూ తిరగడం, ఆమె కుమారుడు గురుదేవ్ మురిసిపోతూ చూశాడు. అతని వయస్సు 78- అంటే ఈవిడ వయస్సు ఎంత? సరిగ్గా 101 ఏండ్లు. ఈ తాతా తాతమ్మల ముందు యువతీ యువకులు నిలబడలేరు. ఈ తల్లికొడుకుల అనుబంధం, ఆరోగ్యం అపురూపం. మాన్‌కౌర్‌గారు ఇప్పటికి ఆక్లాండ్ (న్యూజిలాండ్)లో (2007) మొదలుపెట్టి ఇరవై మెడల్స్ పరుగులోను, షాట్‌ఫుట్, హైజంప్‌లోను సాధించింది. వచ్చే ఏడాది మలేసియాలో జరిగే మాస్టర్స్ అంతర్జాతీయ గేమ్స్‌కు రెడీ అవుతోంది. ఆమె 90వ ఏట ‘‘అమ్మ నువ్వు మోకాలి నొప్పులు నడుము నొప్పి లాంటివి లేకుండా పిడిరాయిలాగా వున్నావు- పరిగెత్తడం మొదలుపెట్టు’’ అంటూ కొడుకు ప్రోత్సహించాడు. ఇద్దరూ ట్రాక్ మీద పోటాపోటీలుగా పరుగులు తీశారు. ‘‘తల్లికి స్వయంగా రొట్టెలు ప్రత్యేకంగా కిఫీర్ పాలు అవీ చేసి నా ఆరోగ్యాన్ని కాపాడుతాడు’’ నా కొడుకు బంగారు తండ్రి అన్నది ఆమె. వంద, రెండు వందల మీటర్ల పరుగులో మాస్టర్స్ గేమ్స్ మెడల్స్ అన్నీ ఆమెవే. ఏ దేశమేగినా నా దేశం తరఫున పోటీ చేస్తున్నాను అంటేనే నాకు సర్వశక్తులూ వస్తాయి. రోజు ఒక ప్రద్ధతిలో అభ్యాసం చెయ్యండి- దిగులు చెందకండి అని సలహా ఇస్తుంది ఆమె.
ఎక్కడికి పోయినా అమ్మ కొడుకులు కలిసే వెళ్తారు.. తల్లి శుశ్రూష అంతా ఎనభయ్యోపడిలో వున్న గురుదేవ్ సింగ్‌దే! కొడుకుకి కూడా పరుగులో కాంస్య పతకం, లాంగ్‌జంప్‌లో వెండి మెడలూ గట్రా వచ్చాయి- అమ్మ అతని వెంటే వుండి హుషారు ఇస్తుంది.. అమ్మదే క్రెడిట్ అంటాడు తల్లి కాళ్ళకి మొక్కి వెంటనే ఆమెను కౌగిలించేసుకుని గిరగిర త్రిప్పేస్తాడు.. ‘గురు’.. జయహో!

-వీరాజీ