Others

పాటల పూదోటలో మరో కోయిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

19 ఏళ్ల సారికాదేవి సంగీతంపై ప్రముఖ గాయనీగాయకులు శ్రేయా ఘోషల్, అంకిత్ తివారీ, అర్మాన్ మాలిక్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాను ఎంచుకుని ఈ వర్థమాన గాయని తన పాటలను అప్‌లోడ్ చేస్తూంటుంది. ఈ పాటలను విని చాలామంది ఆమె గాత్రాన్ని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు కచేరీలు చేస్తేనే సంగీతకారులకు గుర్తింపు లభించేది. కానీ ఆధునిక టెక్నాలజీ అన్నింటిని దగ్గర చేరుస్తున్నట్లే పలువురు సంగీతకారులు సుస్వరాలకు పెద్దపీట వేసి అందరికీ అందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్లు వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో వర్థమాన సంగీతకారులు తమ గళాలను వినిపిస్తున్నారు. వీరు ఈ సోషల్ మీడియాను శక్తివంతమైన సాధనంగా మలుచుకుంటున్నారు. సారికాదేవి కూడా తన రాబోయే చిత్రం హాఫ్ గర్లఫ్రెండ్ సినిమాలో తాను పాడిన పాటలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఫెర్హన్ సరుూద్‌తో కలిసి పాడిన పాటను విన్న ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అంకిత్ తివారీ, ఆర్మాన్ మాలిక్ వంటి వారితో కలిసి పాడిన పాటలను సోషల్ మీడియాల్లో పెట్టడంతో సారికాదేవికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. సంగీతం అంటే సారికకు ప్రాణం. అందుకే నాలుగవ తరగతి నుంచే ఆమె పాడటం ప్రారభించింది. సంగీత సాధన తన ముద్దులు కుమార్తె చూపుతున్న శ్రద్ధను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఏనాడు నిరుత్సాహాపరచలేదు. వారి ప్రోత్సాహంతోనే పదవ తరగతి వచ్చేసరికి సంగీతంపై పట్టు సాధించింది. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలు తమకు ఇష్టమైన రంగాల్లో రాణిస్తారని చెబుతోంది సారికా. హైదరాబాద్‌లో సంగీతానికి సంబంధించిన రియాలిటీ షోలు నిర్వహించకపోవటం పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. వర్థమాన గాయకులను ప్రోత్సహిస్తే వారికి తగిన గుర్తింపు వస్తుందని అంటోంది ఆమె.