Others

అమ్మవారి ‘వాణి’... సరస్సుకు గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారికి చెందిన రామదుర్గ అనే గ్రామంలో ఈ మండుటెండాకాలంలో కూడా ఆ సరస్సు నిండుగా నీళ్ళు. ఆ నీటిలోపల జలపుష్పాలు వున్నాయి. కాని వానల్లేవట. రాత్రికి రాత్రే కుర్రకారు ఆ పెద్దచెరువుకి గండి కొట్టేశారు. మొత్తం నీళ్ళు అన్నీ కాలవల పాలు అయినాయి. ఉదయమే కుప్పలుగా మిలమిల మెరుస్తూ చేపలు నీళ్లు చాలక కొట్టుకుంటున్నాయి. ఎవడ్రా? అంటే ‘దైవ-వాణి’ చెప్పిందట- ఎన్నాళ్ళో అయింది సరస్సులో పాత నీరు కదలటంలేదు కనుక ఊరికి అరిష్టం, వాన రాదు అని గ్రామ దేవత చెప్పిందని జనవాక్యం- చేపలు పట్టుకునే మత్స్యకారులు మాత్రం పండుగ చేసుకున్నారు. మరి వాళ్ళే ఈ పని లోపాయికారిగా చేశారో ఏమో? పెద్దలకి అర్థం కాలేదు. మరో కథ కూడా ప్రచారంలోకి వచ్చింది పోయిన బుధవారం. ఆ వూళ్ళో అగ్రకులాల వాళ్ళు దళితులు తమ వైపు నీళ్ళని వాడేసుకుంటున్నారన్న కోపంతో ఈ పని చేయించారని పుకారు కూడా వుంది. ఏది ఏమయితేనేమి నీళ్ళ ఎద్దడి సమయంలో ఈ కొత్తూరు తాలూకా రామదుర్గా గ్రామం పెద్ద చెరువు ఖాళీ అయిపోయింది. చేపల సంత ఝామ్మని సాగింది కాని అమూల్యమైన జలనిధి వృధా అయింది.