Others

ఇఫ్తార్ విందులో ఆవు పాలకోవ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2002 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఒక ఆర్‌ఎస్‌ఎస్ శాఖ పనిచేస్తోంది. ఉత్తరాఖండ్‌లో కూడా దీని బ్రాంచ్ పనిచేస్తున్నది. హిందూ-ముస్లిం సంఘీభావ ఉద్దీపన దీని కర్తవ్యం. ఈ ఏడాది ‘ఎంఆర్‌ఎం’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నామని ఆ సంస్థ కోకన్వీనర్ మహీరాజధ్వజ్ సింగ్‌గారు ప్రకటించాడు. రంజాన్ ఉపవాసం సాయంకాలం విరమించేటపుడు ఆవు పాలు పుచ్చుకుని తమ ఉపవాస దీక్ష తమ సంస్థ ముస్లిం సభ్యులు అంతా విరమిస్తారని- ఆవును కాపాడే ఉద్యమం దీనివల్ల బలపడుతుందని నమ్ముతున్నామని, చెపుతూ ఉపవాస దీక్ష విరమణలో ఆవుపాలకోవ వంటి తీపి పదార్థాలు వుంటే తమకి సంతోషమని ముస్లిం నాయకులూ చెప్పారని కూడా ఆయన చెప్పారు. ఇఫ్తార్ విందులో కూడా ఈసారి ఆవు పాలతో చేసిన పదార్థాల వడ్డన జరుగుతుందని- దీనికి లక్నోలోని పసమందా ముస్లిం సంఘ్ నాయకుడు జనాబ్ వసీంరాయనీ తన సమ్మతి తెలిపారని సంఘ్ వర్గాలు చెపుతున్నాయని వార్తలు చెబుతున్నాయి.