Others

జిడ్డు మరకలు పోవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంటింట్లో పడ్డ జిడ్డు మరకలు పోవాలంటే గృహిణులకు తలకుమించిన భారం అవుతుంది. ఎన్నిసార్లు ఉతికినా దుస్తులపైన పడ్డ మరకలు ఓపట్టాన వదలవు. ఇలాంటి మొండి మరకలు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చిటికెలో మాయం అవుతాయి.
జిడ్డు మరకలు పడిన వెంటనే దుస్తులపై మొక్కజొన్న పిండి చల్లితే.. ఆ పిండి మరకల జిడ్డును పీల్చేసుకుంటుంది.
నిమ్మరసం, వెనిగర్ సమపాళ్లలో కలిపి.. ఓ గినె్నలోకి తీసుకోవాలి. మరక ఉన్న ప్రాంతాన్ని ఈ మిశ్రమంలో నానాబెట్టి ఉతకాలి. ఇలా చేయడం వల్ల మరకలే కాదు దుస్తుల నుంచి వచ్చే దుర్వాసనలూ దూరమవుతాయి.
జిడ్డు పడ్డ చోట దుస్తులను అదేపనిగా ఉతకటం వల్ల అక్కడ తెల్లగా పాలిపోయి పోగులు విడివడినట్లుగా తయారవుతాయి. అందుకే నీళ్లకు బదులు టాల్కం పౌడర్ లేదా బేబీ పౌడర్ మరక మీద చల్లి కాసేపు ఉంచితే, పౌడర్‌లోని తేమ మరక మీద జిడ్డును పీల్చేసుకుంటుంది. ఆ తరువాత ఉతికితే మరక మటుమాయం అవుతుంది.
వంటసోడాలో నీళ్లు కలిపి మిశ్రమంలా చేయాలి. దాన్ని మరక ఉన్నచోట రాసి పక్కనుంచాలి. అరగంటయ్యాక డిటర్జెంట్ పొడి కలిపిన నీళ్ల లో ఆ దుస్తుల్ని నానబెట్టి ఉతికితే సరిపోతుంది. ఒకేసారి మరక పోనట్లయితే రెండు మూడుసార్లు ఈ విధంగా చేస్తే సరిపోతుంది.