Others

అసహాయులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతరం సరికొత్త ఆశలు, ఆలోచనలతో ముందుకు సాగుతోంది. ఇలాంటి కోవకు చెందినవారే ఈ యువ ఇంజనీరింగ్ విద్యార్థినులు. ఇంకా నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకోనూలేదు. అప్పుడే సేవబాట కాదు కాదు..సహాయ బాట పట్టారు. రక్తదానం..ప్రమాదాల్లో గాయపడిన విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందివ్వడం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్లు పంచడం.. తమ కళాశాల క్యాంపస్ హాస్టల్‌లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పేదవారికి అందించి వారి ఆకలి తీర్చడం వంటి సేవా కార్యక్రమాలతో ఈ యువ ఇంజనీర్లు ఆకట్టుకుంటున్నారు. ఈ యువతులు అందిస్తున్న సేవలు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయ.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మాగంటి దివ్యహరిత ఆలోచనల నుండి ఆవిర్భవించిందే ఈ సహాయ క్లబ్. ప్రస్తుతం మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న దివ్యహరిత కళాశాలలో చేరిన తర్వాత తనకు వచ్చిన ఒక ఆలోచనను ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసరావు, వైఎస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరాజుతో పంచుకుంది. వారి ప్రోత్సాహంతో ‘సహాయ’క్లబ్‌ను నెలకొల్పింది. 2016లో ఏర్పాటుచేసిన ఈ సహాయ క్లబ్‌లో విష్ణు విద్యాసంస్థల ఆధ్వర్యంలోని ఏడు కళాశాలలకు చెందిన విద్యార్ధులు భాగస్వామ్యులై ప్రతీ రోజు వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
సహాయ క్లబ్ క్యాంపస్‌లో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వీటిని తిలకించడానికి కొంత రుసుము వసూలు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు క్యాంపస్‌లోని ఏడు కళాశాలల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇలా తిలకించడాని వారు చెల్లించిన రుసుము ద్వారా వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పెన్సిళ్లు, నోటు పుస్తకాలు తదితర విద్యాసామాగ్రిని అందించింది సహాయ క్లబ్. విష్ణు డెంటల్ కళాశాలకు చెందిన 627 మంది విద్యార్థులు ఇప్పటి వరకు రక్తదానం చేశారు. ప్రతీ రోజు 1635 మంది వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు క్యాంపస్ క్యాంటీన్లలో మిగిలిన ఆహార పదార్థాలను భీమవరం పరిసర ప్రాంతాల్లోని పేదలకు అందించ, వారి ఆకలి తీరుస్తున్నారు. విష్ణు ఎడ్యుకేషనల్ సోసైటీ ద్వారా ఇప్పటి వరకు హైదరాబాద్, భీమవరం, నిడదవోలు, ఏలూరు ఇలా అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి, కిడ్నీ వ్యాధిగ్రస్థులకు, బధిరులకు ఆర్థిక సహాయం చేసి ‘సహాయ’క్లబ్ అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది.

చిత్రాలు.. కిడ్నీ ఆపరేషన్‌కు సహాయ క్లబ్ సమకూర్చిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్న కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరాజు
* రక్తదానం చేస్తున్న విద్యార్థినులు

- టి.స్వామి అయ్యప్ప