Others

ఎలాంటి హ్యాండ్ బ్యాగుల్ని ఎంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురిలో అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే దుస్తులే కాదు, హ్యాండు బ్యాగుల్ని కూడా ఎంచుకోవడంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి. ఇప్పుడు ఫ్యాషన్ యాక్సెసరీల్లో హ్యాండు బ్యాగులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈతరం స్ర్తిల అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా పలు రకాల డిజైన్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే వాటిని ఎంచుకొనే ముందు కేవలం ఫ్యాషన్‌ను మాత్రమే కాకుండా సౌకర్యం, రంగు, శరీరాకృతికి తగినట్లుగా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి.
పెద్దగా వుండే లెదర్ నలుపు, గోధుమ రంగుల్లో ఎంచుకొంటే అవసరమైన వస్తువులన్నింటినీ వేసుకోవడానికి వీలుంటుంది. కాస్త ఎత్తు తక్కువగా, లావుగా కనిపిచేవారు సన్నని రకాల్ని ప్రయత్నిస్తే బాగుంటుంది. సన్నగా, పొడుగ్గా ఉన్నవారు గుండ్రని ఆకృతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంట తీసుకెళ్తే చూడముచ్చటగా కనిపిస్తారు.
పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు బ్రోకెడ్ క్లచ్ సరైన ఛాయిస్‌గా ఉంటుంది. ఉదయం వేళ పార్టీల్లాంటివాటికి పెద్ద పెద్ద బ్యాగులు సరైన ఎంపికవుతాయి. సాయంత్రాలైతే మాత్రం క్లచ్‌ను మించిన సొగసు లేదు. క్లచ్‌లు కూడా ఇప్పుడు పలు డిజైన్లలో లభిస్తున్నాయి. ప్రముఖుల స్థాయి నుంచి సామాన్య మహిళల దాకా అందరి మనసూ దోచేస్తుంది. దుస్తులకు తగిన రంగుల్లోనూ అందుబాటులో ఉంటాయి.