Others

మనిషి గుండెచప్పుడు మొబైలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మనుగడ సక్రమంగా సాగాలంటే నేడు ప్రతి ఒక్కరికి మొబైల్ తప్పనిసరి. ఇకపై మొబైల్ ఫోన్ మనీపర్సు కూడా! నగదు రహిత లావాదేవీలు ప్రస్తతం ప్రజలందరు తెలుసుకోవడం తప్పనిసరి అయింది. పెద్దనోట్ల రద్దు తరువాత మొబైల్ ద్వారానే లావాదేవీలు నిర్వహణకు మొబైల్ వినియోగానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయి. అందుకే సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రతిభ వున్నవారు కొత్త యాప్‌లు రూపొందించే పనిలోపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం నేడు జేబులో పర్సు లేకపోయినా పర్వాలేదు బ్యాంకులో వున్ననగదుతో మొబైల్ ద్వారా తమ ఆర్థిక అవసరాలను లావాదేవీలను తీర్చుకోవచ్చు.ఒక్కమాటలో చెప్పాలంటే వినోదానికైనా, మంచికైనా, చెడిపోవడానికైనా మొబైలే. మానవుడు గుండెచప్పుడు మొబైల్. ఆకలితో వుండగలడేమో కానీ మొబైల్ లేకపోతే బతకలేని స్థితి.
మొబైల్‌ద్వారా మన బ్యాంకు ఖాతాలో సొమ్ము ఎంతవుందో తనిఖీచేసుకోవచ్చు. డిపాజిట్ వివరాలు తెలుసుకోగలం. రైలు, బస్సు, విమాన టికెట్లు బుక్ చేసుకోగలం. ఆస్తి, నీటి, కరెంటు బిల్లులు, ఆదాయ పన్నులు చెల్లింపుకోసం మొబైల్ ఉంటే చాలు.ఇలా ప్రతి పనికి ఉపయోగపడేది సెల్ మాత్రమే. హెల్ అయినా హెవెన్ అయినా మొబైలే. అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మొబైల్ అంతర్జాల బ్యాంకింగ్ ఎక్కువగా వుపయోగించ లేకపోవడానికి ఇక్కడి ప్రజలకు వీటిపై అవగాహన లేకపోవడమే. అయితే ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరు సెల్‌ను ఉపయోగించాలని ప్రభుత్వాలు చెపుతున్నా ఈ మొబైల్స్ సంఖ్య పెరిగి ప్రతి ఇంట్లో సెల్స్ వుండడంవలన ఎంత ప్రయోజం వుందో అంతకు రెట్టింపు చిక్కులు, సమస్యలు ఏర్పడుతున్నాయి అనడంలో తప్పులేదు. మొబైల్‌లోని అశ్లీల చిత్రాలకు చిన్నవయసు వారు కూడా నీలి చిత్రాల వ్యామోహంలో పడి విలువైన బంగారు జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్న సంఘటనలు ఎన్నో..కాబట్టి విద్యార్థులు, యువత కాస్త ఆలోచించండి. మనిషి విజ్ఞానపు గుండె చప్పుడు కూడా మొబైలే అని గుర్తించండి.

-ఈవేమన