Others

కలిసి జీవిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమిష్టి జీవన విధానం అపార్ట్‌మెంట్‌లలోనే కనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రజలు నివశిస్తూ ంటారు కాబట్టి, అపార్ట్‌మెంట్ నాది, మనది అనే భావన అందరిలో కలగాలి. ఏదైనా సమస్య వస్తే ఈర్ష్యా, ద్వేషభావాలు వీడి అందరూ కలిసి సందర్భోచితంగా మాట్లాడుకుంటే మంచిది. స్వంత నిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసిపోతుంటే ఎలాంటి సమస్యలు రావు. మనం మాట్లాడే ప్రతి మాటా ఎదుటివారి హృదయానికి పువ్వులా తాకేవిధంగా ఉండాలి. అంతేకాని బురదలా అంటుకోకూడదు. కలిసిమెలిసి ఒకచోట నివసించే వాళ్ళు సంభాషణలను కోపంతో కాకుండా నిదానంగా మొదలుపెడితే ఏ గొడవలు ఉండవు. ఎదుటివాళ్ళు కూడా అదేవిధంగా స్పందిస్తారు. ఎదుటివాళ్ళు మన మాటల్ని ఒపుకోవాలనే ఉద్దేశ్యంతో గట్టిగా అరవడం, గంతులు వేయడం సంస్కారం అనిపించుకోదు. పక్కవాడు మనల్ని ఎలా గౌరవించాలని అనుకుంటామో, అదేవిధంగా వాళ్ళను మనం గౌరవించాలి. సమస్యను మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించడంవల్ల సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. మెజారిటీ సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ.. తోటివారితో సోదరభావంతో మెలుగుతూ.. ఆప్యాయత, అనురాగాలను పంచుకోవడానికి ప్రయత్నించాలి. చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా ఉంటే ఏ అపార్ట్‌మెంట్ అయినా ఒక బృందావనంలా ఆనంద నిలయంలా వెలుగుతుంది.

-కాయల నాగేంద్ర