Others

అమ్మతనానికి ఇదో మార్గం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ అనే పిలుపులో ఉన్న కమ్మదనాన్ని ఆస్వాదించటానికి నేడు ఎన్నో ప్రక్రియలు వచ్చాయి. ఇందులో ఐవిఎఫ్ పద్ధతి ఒకటి. తరచూ గర్భస్రావం అయ్యే మహిళలు ఈ పద్ధతి ద్వారానే తల్లులవుతున్నారని తాజా అధ్యయానాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక భారం, భావోద్వేగాలకు సంబంధించినదైనప్పటికీ మహిళలు ఐవిఎఫ్ పద్దతి ద్వారా అమ్మ అయ్యేందుకు సుముఖుత వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ మహిళలు ఎలా పిల్లలను కంటారో వీరు కూడా అదేవిధంగా విజయవంతంగా పిల్లలను కంటున్నారు. అబెర్డన్ యూనివర్శిటీవారు నిర్వహించిన తాజా అధ్యయనంలో గత పదేళ్ల కాలంలో ఐవిఎఫ్ పద్దతి ద్వారా గర్భవతులైన తల్లులు దాదాపు 1,12,000 మంది రికార్డులను పరిశీలించారు. వీరిలో 62.3% మంది మహిళలకు గర్భధారణ జరగలేదు. 8.3%మందికి గర్భస్రావం అయింది. 29.5% మందికి పిల్లలు పుట్టారు. మొదటిసారి గర్భస్రావం అయిన మహిళల్లో 31.7% మంది రెండవ సారి ఐవిఎఫ్ చికిత్స ద్వారా తల్లులు అయ్యారు. కాబట్టి గర్భస్రావం అవుతున్న మహిళలు ఈ ఐవిఎఫ్ పద్ధతి ద్వారా విజయవంతంగా తల్లులవటానికి అవకాశాలు ఉన్నాయని డాక్టర్ డేవిడ్ మెక్కెరాన్ వెల్లడించారు.