Others

భావి తరాలకి చాటాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప నగరం ప్రకాష్‌నగర్ క్లాసిక్ టవర్స్‌లో నివశిస్తున్న శ్రీమతి కె.విజయలక్ష్మి ఇంటికి వెళితే మట్టితో చేసిన బొమ్మల కొలువు దర్శనమిస్తుంది. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదివి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి విజయలక్ష్మి గత తొమ్మిది సంవత్సరాలుగా బొమ్మల కొలువును నిర్వహిస్తూ వున్నారు. నాలుగు వందలకుపైగా మట్టితో చేసిన బొమ్మలుకొలువులో దర్శనం ఇస్తాయి. తొమ్మిది మెట్లు వున్న ఒక వేదికతోపాటు మరో మూడు వేదికలను ఏర్పాటుచేసి కొలువును తీర్చిదిద్దారు. దుర్గాదేవి, త్రిమూర్తులు, శ్రీవేంకటేశ్వరస్వామి, సీతారామలక్ష్మణులు, దశావతారాలు, హయగ్రీవుడు, సూర్యుడు, పాండురంగడు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి, మధుర మీనాక్షి, కాశీవిశాలాక్షి, కంచి కామాక్షి, అష్టలక్ష్ములు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప మొదలైన దేవతామూర్తుల బొమ్మలు, ఆదిశంకారాచార్యులు, రాఘవేంద్రస్వామి, వివేకానందుడు, షిరిడి సాయిబాబా వంటి మహనీయులు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, శ్యామశాస్ర్తీ వంటి సంగీత విద్వాంసులు, దేశ నాయకులు, రైతులు, వ్యాపారులు వంటివారి బొమ్మలు కొలువులో నయనానందకరంగా దర్శనం ఇస్తాయి.
రావణ దర్బారు, గుహుడు రాముడిని నదిని దాటించే దృశ్యం, వివాహం, కామాక్షి పూజ, సత్యనారాయణవ్రతం, లక్ష్మీనారాయణ పూజ, స్తంభం నుండి నరసింహస్వామి ఆవిర్భావం, అరుణాచల గిరి ప్రదక్షిణ, బృందావన కృష్ణుడు వంటి సన్నివేశాలతో కూడిన బొమ్మలు ఆయా పురాణ గాధలను కళ్ళముందు కదిలేలా ఏర్పాటుచేశారు. వీటితోపాటు ఇసుకలో గడ్డిని మొలిపించి ఏర్పాటుచేసి పార్కు పిల్లలు, పెద్దలను కూడా ఆశ్చర్యపడేలా చేస్తోంది. వీరు ఈ బొమ్మలను చెన్నై, తిరుపతి, మధురై, రామేశ్వరం, కాశి, శ్రీశైలం వంటి ప్రాంతాలనుంచి సేకరించారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేసే ఈ దంపతులలు ఎక్కడకు వెళ్లినా బొమ్మలను సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొలువును చూడడానికి వచ్చిన వారికి, పిల్లలకు శ్రద్ధతో బొమ్మల గురించి.. వాటికి సంబంధించిన పురాణ గాథలను వివరిస్తూ వుండడం విశేషం.
భావితరాలకోసమే..
మన సంప్రదాయం లేదా ఏదైనా ఒక బొమ్మను గురించి అడిగితే పిల్లలే కాదు యువత కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో తొమ్మిది సంవత్సరాల క్రితం నాకు బొమ్మల కొలువు పెట్టి భావితరాలకు మన సంప్రదాయాలు, ఆచారాలు తెలపాలనే కోరిక కలిగింది. నా చిన్నతనంలో మా ఇంట్లో బొమ్మలకొలువు పెట్టేవారు. నా భర్తను అడిగితే బొమ్మలకొలువు పెట్టేందుకు అంగీకరించడంతో, దసరా ఒక నాలుగు రోజులు ఉందనగా మా అబ్బాయిను వెంట బెట్టుకొని తిరుపతి, తిరుచానూరు వెళ్లి కొన్ని బొమ్మలు తెచ్చి కొలువు పెట్టాను. అప్పటినుంచి ఎక్కడికి వెళ్లినా బొమ్మలు సేకరించడం అలవాటుగా పెట్టుకున్నాను. దీనితో పెద్ద బొమ్మల కొలువు ఏర్పడింది. సందర్శకులు ప్రధానంగా పిల్లలు వచ్చి చూసి దీనిని గురించి అడిగి తెలుసుకొంటే ఆనందం రెట్టింపు అయి కొనసాగించేలా చేస్తోంది. తల్లిదండ్రులు కూడా విద్యతోపాటు మన సంస్కృతీ సంప్రదాయాల గురించి పిల్లలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-శ్రీమతి విజయలక్ష్మి