Others

చిన్న వయసులోనే సేవామార్గంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేడేళ్ల వయసులో మేఘన ఏర్పాటు చేసిన సంస్థ పేరు ‘ది వరల్డ్ వండర్‌ఫుల్‌‘. ఆమె దృష్టిలో ఇది అందమైన ప్రపంచం. ఈ అందమైన ప్రంపచాన్ని సృష్టించాలంటే తానొక్కర్తే సరిపోదు. తనతోపాటు కొంతమంది ఉండాలని భావించింది. ఇందుకోసం సోషల్‌మీడియాను ఉపయోగించుకున్నది. ఐటీ హబ్స్ సాయం కూడా తీసుకున్నది. ఆమె ప్రయత్నం ఫలించింది. సోషల్‌మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఖ్యాతి, కాలిఫోర్నియాకు చెందిన కాటూరి సౌమ్య (18), న్యూయార్క్ చెందిన గరిమెళ్ల ప్రణీత (20) జత కలిశారు. ఈ నలుగురు కలిసి ‘ది వరల్డ్ వండర్ ఫుల్’ స్వచ్ఛంద సంస్థకు ఓ రూపం తీసుకువచ్చారు. సేవాదృక్పథం సౌమ్య, ప్రణీతలను ఇండియాకు రప్పించింది. ఈ స్వచ్ఛంద సంస్థ కోసం ఈ ఇద్దరు ఐదేళ్ల క్రితం ఇండియాకు వచ్చేశారు. వీరంతా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును దూరవిద్య ద్వారా చదువుకుంటూ తాము ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థకు నిధులు సేకరణ ప్రారంభించారు. మంచి పనికి మంచి మనుషులు ఎల్లప్పుడూ తోడుంటారు. వీరు చేయబోయే పనికి ఐటీ హబ్స్ నుంచి విశేష స్పందన లభించింది. నిధులు సమకూరటం ప్రారంభమయ్యాయి. సేవకు వయసు అనేది అడ్డంకి కానేకాదు. సేవ చేసేందుకు ఆమె రెండు చేతులే కాదు మరో ఆరు చేతులు కలిశాయి. ఇంతకుమించిన తరుణం లేదని భావించారు. ఈ నలుగురు మందుకు కదిలారు. చాలామంది వీరిని ఎన్నో ప్రశ్నలతో ఆటంకాలు కల్పించారు. అయినా వీరి ఆత్మస్థయిర్యం ముందు నిలబడలేకపోయాయి. తల్లిదండ్రుల, ఐటీ సంస్థల తోడ్పాటుతో అడుగుముందుకు వేశారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలతో పాటు విలువలతో కూడిన జీవిత పాఠాలను చిన్నవయసులోనే పిల్లలకు నేర్పితే వారే ఆదర్శపౌరులు అవుతారని వీరి విశ్వాసం. వీరి విశ్వాసంలో ఇసుమంతైనా నిరాశకు చోటులేదు. మార్పు కోసం సిద్ధమయ్యారు. అందుకోసం తమ వంతు ప్రయత్నం ఆరంభించారు.