Others

పాటకు పల్లవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దృష్టి అపూర్వ బి.టెక్ విద్యార్థిని. హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికి బాలీవుడ్ సినిమా పాటలంటే ప్రాణం. ఇపుడు ఎవ్వరి చెవుల్లో చూసిన ఇయర్ ఫోన్స్ కనిపిస్తుంటాయి. వారికిష్టమైన పాటలు ఆన్ చేసుకుని చక్కగా వింటూ తమ లోకంలో తాము ఉంటున్నారు. మానసికోల్లాసానికి చిరునామాగా నిలిచిన నేటి సాంకేతిక పరిజ్ఞానంలో రోజు రోజుకు కొత్త కొత్త అంశాలు చోటుచేసుకుంటున్నట్లే సాహిత్యం ఆధారంగా పాటను ఎంపిక చేసుకుని వినే డేటాబేస్ సదుపాయంపై పరిశోధన చేసిన ఈ కంప్యూటర్ విద్యార్థినికి ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. మయన్నార్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో దృష్టి అపూర్వ పాల్గొని తాను వర్గీకరించిన విషయంపై పరిశోధనా పత్రాలు సమర్పించింది. దృష్టి చేసిన వర్గీకరణ వల్ల హిందీ సాహిత్య విశే్లషణ, బాలీవుడ్ పాటల్లో కోడ్ మిక్సింగ్ పొందుపరచటం సులభతరం అవతుంది. రాబోయే పరిశోధకులకు సైతం ఉపయోగపడుతుంది. పాటల సాహిత్యాన్ని అమితంగా ఇష్టపడే అపూర్వ గత ఏడాది నుంచి సాహిత్యం అధారంగా బాలీవుడ్ పాటల వర్గీకరణపై తీవ్రమైన కృషే చేసింది. పాటల సాహిత్యంలో దాగి ఉండే భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ వర్గీకరణ ఇతర భాషల్లోని పాటలకు సైతం ఉపకరిస్తుంది.