Others

పచ్చగడ్డి మొలిచింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇంటి బాల్కనీ లేదా ఖాళీ స్థలం పచ్చని చీర కట్టుకున్న పచ్చిక బయలు వలే ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఆలాంటి పచ్చిక మీద సేద తీరాలని ఆరాటపడుతున్నారా? అయితే మీ కోరిక చిటికెలో నెరవేరుతుంది. ఎలా అంటే రాచఠీవితో మీ ఇంటికి వచ్చిన అతిథులకు స్వాగతం చెప్పేందుకు ఆర్ట్ఫిషియల్ పచ్చికతో లాన్ ఏర్పాటుచేసుకోటం చాలా సులభతరం. చాలా తక్కువ ఖర్చుతో మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసుకుంటే కనువిందు చేస్తుంది. ఈ కృత్రిమ గడ్డి ఎప్పుడూ కూడా తాజాదనంతో ఉంటుంది. దీని నిర్వహణ సులువే. అదే గార్డెన్‌లో పెంచుకునే గడ్డి అయితే ఆదివారం వచ్చిందంటే దాన్ని ఓ క్రమపద్ధతిలో కొడవలితో కోయాలి. వేసవి కాలం వచ్చిందంటే ఈ గడ్డి పసుపురంగులోకి మారకుండా నీళ్లు అందించాలి. అలాగే గడ్డితో అందమైన డిజైన్ తయారుచేసుకోవాలన్నా కష్టమే. పిల్లలు గడ్డిలో ఆడాలని ఉబలాటపడుతుంటారు. వారి ఇష్టాన్ని కాదనలేం. గడ్డి బాగా పెరిగితే దురద వంటి ఫంగస్ పిల్లలకు అంటుకుంటుంది. ఇలాంటి బాధలన్నీ కృత్రిమ గడ్డితో ఉండవు. గడ్డిని శుభ్రం చేసుకోవటం తేలిక. పిల్లలు సైతం చక్కగా ఇష్టపడతారు. నీటి సదుపాయం ఉండాలనే బాధ లేదు. పిల్లలకు, పెద్దలకు నచ్చిన డిజైన్‌లోచక్కగా..అందంగా అమర్చుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం పచ్చటి కృత్రిమ గడ్డిని ఏర్పాటు చేసుకోండి.