Others

అలెర్జీ అంటే ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈకాలంలో తరచూ అలెర్జీ అన్న పదం వినిపిస్తునే వుంటుంది. ఆహారం, పుప్పొడి రేణువులు, దుమ్ములోని పురుగులు (డస్ట్‌మైట్స్), మందులు ఇలా ఎన్నో వాటి వల్ల ఈ సమస్య వస్తుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ అన్నది మన శరీరంలో అతి క్లిష్టమైన వ్యవస్థ. వైరస్, బాక్టీరియా, టాక్సిన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతూ వుండే వ్యవస్థ. అలెర్జీ కారకాలు మన శరీరంలో చొరబడడం ఆలస్యం వీటిని హానికారకాలుగా గుర్తించిన క్షణమే రోగ నిరోధక వ్యవస్థ వాటిపై దాడి మొదలుపెడుతుంది. ఉదాహరణకు ఓ పుప్పొడి రేణువు (అలెర్జీ కారకం) మన శరీరంలోకి ప్రవేశించిందనుకోండి. అప్పుడు రోగ నిరోధక శక్తి ఆ పుప్పొడి ఎక్కడవుందో గ్రహిస్తుంది. దానిపై పోరాడేందుకు యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీ బాడీలనే ఇమ్యునో గ్లోబులినుఅంటారు. ఈ యాంటీబాడీలు కణాల్లోకి ప్రయాణం చేసి పుప్పొడిపై దాడికిగాను రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవే అలెర్జీ రియాక్షన్ కారణం అవుతాయి. ఈ రియాక్షన్ ముక్కు, ముక్కు నాసికా కుహరములలోను, గొంతు, ఊపిరి తిత్తులు, చెవులు, కడుపు, చర్మంలోపల లక్షణాలకు దారితీస్తుంది. కొన్ని పదార్ధాలే ఎందుకు అలెర్జీకి దారితీస్తాయి. వేరేవి ఎందుకు కారణం కావన్నదానికి ఆధారాలు నిర్ధారణ కాలేదు. అలెర్జీకి లోనైతే,అవే కారకాలు మరికొందరిలో అలెర్జీకి దారితీయకపోవడం వెనుకనున్న కారణాలను ఇతమిద్ధంగా తేల్చలేదు.