Others

యోగదాత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాల మేలుకలయిక. పరిపూర్ణ ఆరోగ్యానికి పనికొచ్చే యోగాసానాలు మనచెంతకు తెస్తుంది ఒబిలిశెట్టి మాధురి. ఇరవై రెండేళ్ల మాధూరి పిల్లలకు, పెద్దలకు ఉచితంగా యోగాసానాలు నేర్పుతోంది. యోగా సాధన చేయటం అంటే ఆత్మసాక్షాత్కరం చేసుకోవటమే అని అంటోంది. యోగాను మన డైలీ జీవితంలో భాగంగా చేసుకుంటే జబ్బులే దరిచేరవు అంటూ మార్గదర్శనం చేస్తోంది. యోగా ఫలితాలను ప్రజలకు చేరువచేస్తున్న మాధురి ముందు పెద్దలు సైతం విద్యార్థిగా మారిపోతారు.
నాలుగేళ్ల నుంచి..
సిఏ చేస్తున్న మాధురి గత నాలుగేళ్ల నుంచి పిల్లలకూ, పెద్దలకూ యోగాపాఠాలు నేర్పుతోంది. మూడు యోగా ఇన్‌స్టిట్యూట్స్ నుంచి సర్ట్ఫికెట్లు పొందిన మాధురి యూట్యూబ్‌లో యోగా గురించి ఇంకా విపులంగా తెలుసుకుంది. మాధురి కుటుంబంలోని సోదరి, తండ్రి కూడా యోగా చేస్తారు. దీంతో మాధురీకి కూడా యోగా చేయడం అంటే ఇష్టం ఏర్పడింది. తండ్రి హఠయోగా మాత్రమే నేర్పుతారు. కాని మాధురి మాత్రం వివిధ రకాల ఆసనాలు బోధించటంలో మాస్టర్. ఆమె బెంగళూరులోని పండిట్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోనూ శిక్షణ తీసుకుంది.
నాలుగింటికే దినచర్య ఆరంభం..
మాధురి దినచర్య నాలుగింటికి ప్రారంభమవుతోంది. ఉదయం పూట మూడు యోగా క్లాసులు బోధిస్తుంది. సాయంత్రం వేళల్లో జిమ్‌కు వెళ్లి కొన్ని కసరత్తులు చేస్తోంది. కసరత్తులు కంటే యోగానే ఆమెకు ప్రాణం. ప్రతి శనివారం వృద్ధులకు యోగాసానాలు నేర్పుతోంది. ఇవి కాకుండా ప్రభుత్వ పాఠశాలలకు, అనాథాశ్రమాలకు వెళ్లి అక్కడ కూడా యోగా తరగతులు నిర్వహిస్తోంది. కొన్ని ప్రేవేటు స్కూళ్లలో పిల్లలకు యానిమల్ యోగా నేర్పిస్తోంది. జంతువుల వలే అరుస్తూ.. పిల్లల్లో యోగా పట్ల ఆసక్తి కలిగిస్తోంది. యోగాలో కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోంది. యోగా ఇన్‌స్ట్రక్టర్ అయినప్పటికీ ఆమె ఇప్పటికీ యోగా గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నించటం అభిరుచికి అద్దం పడుతోంది. రుతు సంబంధమైన సమస్య ఎదురైనపుడు చక్రాసనం సాధన చేస్తూ వాటి నుంచి బయటపడుతోంది. గత నాలుగేళ్ల నుంచి యోగా చేయటం వల్ల తనలో ఎలాంటి మానసిక, శారీరక అనారోగ్యం అనేది లేదని ఘంటాపథంగా చెబుతుంది.