Others

ఆమె మోకాలి నిండా మేకులూ, సూదులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్ఫై ఐదు సంవత్సరాల అనసూయాదేవి, వాళ్ళ ఊరు ఉత్తర భారత్‌లో ఫతేపూర్ దగ్గరి చిన్నపల్లె తప్ప లోకం ఎరుగదు. భర్త పోయినదగ్గరనుంచి అన్నయ్య అవధేష్‌కుమార్ దగ్గరే ఉంటున్నది. కాని 2012 నుంచి ఆమె విపరీతమైన మోకాలి నొప్పితో సతమతమైపోతోంది. నిలబడలేక కూర్చోలేక నడవలేక నానా బాధలు పడుతూ వున్న చెల్లెల్ని ఆ పల్లెటూరు అన్నయ్య- నాటు మందులకు వీడ్కోలు పలికి, జిల్లా ఆసుపత్రికి తీసుకుపోయాడు. వాళ్ళు ఎక్స్‌రేలు తీశారు. ఇంకెక్కడా ఎటువంటి వెలుపలి వస్తువులు కనబడలేదు కానీ మోకాలి చిప్ప క్రింది భాగంలో ఏవేవో వస్తువులు కనబడ్డాయి. ఆమె చెప్పింది- ‘‘నొప్పితో చావాలనిపిస్తాది సామి! మొదట ఓ చిన్న పొక్కు కనబడుతుంది. ఆనక అది పెద్దదిగా పొక్కుతుంది. చీము పట్టి పగులుతుంది. మేకు ‘దానిలోనుంచి నిజం మేకు బయటపడుద్ది’.
ఈ మాటలు వైద్యులకి షాక్ ఇచ్చాయి. శస్తచ్రికిత్సకి పూనుకున్నారు. నమ్ముతారో నమ్మరో కానీ ఆమె మోకాలి క్రింది కాలులో నుంచి ఒక డెబ్భై సిరంజి సూదులు, మేకులు ఒకటి తీస్తే ఒకటి బయటపడ్డాయి. అవి ఎలా వచ్చాయి? అన్నయ్య తెలియదు అంటాడు. ‘‘చెల్లీ నేను ఎరుగను- నానేటి సెయ్యనేది నొప్పితో చావడం తప్ప నానేటి గుచ్చుకోనేదు’’ అంటుంది అనసూయాదేవి. ఐదేళ్ళు ఇలా దుర్భర స్థితిలో క్రుంగి కృశించిపోయింది. సూదులు, మేకులు తానే గ్రుచ్చేసుకుంటోంది అన్న అనుమానం డాక్టర్లకు వున్నది. ‘‘నా జన్మలో నేనిటువంటి కేసు ఎరుగనన్నాడు సర్జన్ డా.నరేష్. కాన్పూర్ పెద్దాసుపత్రికి పంపాలి ఈ కేసుని- పరిశోధన, చికిత్స రెండూ సాధ్యమవుతాయి. దీనికి పైఅధికార్లు అనుమతించాలి అన్నారు జిల్లా వైద్యులు. ఒక వ్యక్తి పొట్టలోంచి ఆమధ్య 639 మేకులు తీశారు డాక్టర్లు అని విన్నాము కాని ఈ మోకాలి మేకుల ‘గని’ని ఊహించలేము. ఆమెయే స్వయంగా బాధకి తట్టుకోలేక ఈ మేకులు గుచ్చేసుకుందేమో? అంటారు వైద్యులు. మొత్తంమీద మేకులు, సిరంజీ సూదులు మాత్రం బయటపడటం వాస్తవం. ఆమెకవి ఎలా వచ్చాయో అన్నది ‘జిఒకె’ అనగా దేవుడికే తెలియాలి!

-వీరాజీ