Others

చక్కెరతో ప్రయోజనాలు ఉన్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారానికి కొరత ఉన్నప్పుడు పంచదార తీసుకోవడంవల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు. టేబుల్ షుగర్‌ను ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకం తయారీకి వినియోగిస్తారు. ఇందులో ఉప్పు కూడా ఉంటుంది. డయేరియా, వడదెబ్బ సమయాల్లో ఓఆర్‌ఎస్ ద్రావకం ప్రాణాలను కాపాడుతుంది. సిమెంటు, వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో చక్కెరను వినియోగిస్తారు.
ఎందులో ఎంత చక్కెర
మిల్క్‌చాక్లెట్‌లో 44 గ్రాములు అంటే ఆరు టీ స్పూన్లకు సమానమైన చక్కెర ఉంటుంది. కోకాకోలా ఒక క్యాన్‌లో 8 టీ స్పూన్లకు సరిపడా చక్కెరలు ఉంటాయి. పెప్సీకోలాలో 9 టీస్పూన్లు, రెడ్‌బుల్‌లో 7 టీ స్పూన్లు, వౌంటెయిన్ డ్యూలో 11టీ స్పూన్ల చక్కెరలు ఉంటాయి. మామిడిపండ్లలో 3 టీ స్పూన్లు, అరటిపండ్లలో 3, యాపిల్ పండ్లలో 2.6, పైనాపిల్ పండ్లలో 2.5, ద్రాక్షలో 4 టీ స్పూన్లు, టమాటాల్లో 0.7 టీ స్పూన్ల ఫ్రక్టోజ్ ఉంటుంది. ఒక స్పూన్ ఐస్‌క్రీమ్‌లో 3 టీ స్పూన్లకు సమానమైన చక్కెర ఉంటుంది.
చక్కెరకు ప్రత్యామ్నాయాలు
స్టీవియో అనేది అమెరికాలో ఎక్కువగా వినియోగంలో ఉంది. ఇది మన దేశంలోనూ అందుబాటులో ఉంది. స్టీవియో అనేది ఒక మొక్క. ఈ చెట్టు ఆకులు ఎండబెట్టిగా పొడిగా చేస్తారు. ఈ పొడి చక్కెరతో పోలిస్తే 40 శాతం ఎక్కువ తీపిదనంతో ఉంటుంది.
టీలు, కాఫీల్లో దీన్ని కలుపుకుని తాగవచ్చు. స్టీవియో పొడిలో కేలరీలు ఉండవు. దీంతో బ్లడ్ షుగర్ పెరగదు. కాకపోతే ఈ పొడి కొంచెం చేదుగా కూడా వుంటుంది.
తేనెలో 53 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. కానీ ఇదంతా సహజసిద్ధమైనది. కనుక మోస్తరు పరిమాణంలో వాడడంవల్ల ఆరోగ్యానికి మంచిదే. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తేనెలో ఉన్నాయి. డేట్ షుగర్ అని ఖర్జూరాలను ఎండబెట్టి పొడిగా మారుస్తారు. తీపి వంటకాల్లో పంచదారకు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను వాడుకోవచ్చు. శాక్రీన్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు కూడా ఏమంత మంచివి కావని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
చక్కెర గుండెకు పెద్ద ముప్పు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2013 నాటి అధ్యయనం ప్రకారం- చక్కెర గుండెకు రక్తాన్ని పంప్ చేసే వ్యవస్థపై ప్రభావం చూపించడం ద్వారా గుండె విఫలం అవడానికి దారితీస్తుందట. 2010లో చిన్నారులపై చేసిన అధ్యయనంలో అధిక ఫ్రక్టోజ్ ఉండే పదార్థాలను తినడంవల్ల ఊబకాయానికి కారణమవుతున్నట్టు, దానివల్ల దీర్ఘకాలంలో గుండె జబ్బుల ముప్పు ఉంటుందని తేల్చారు.
2008లో జరిగిన మరో అధ్యయనంలో అధిక ఫ్రక్టోజ్ వినియోగంవల్ల లెప్టిన్ నిరోధకత పెరుగుతుందని తేలింది. తీసుకున్న ఆహారం సరిపోయింది. కడుపు నిండింది అని తెలియజేసేది లెప్టిన్. లెప్టిన్ నుంచి మెదడుకు సరిగా సందేశాలు అందకపోతే తినే తిండి పెరిగిపోతుంది. దీంతో ఊబకాయం సమస్య ఎదురవుతుంది.
రోజులో ఎంత తీసుకోవచ్చు?
ఆహార ఉత్పత్తుల తయారీలో కంపెనీలు వివిధ రూపాలలో ఉన్న చెక్కరలను కలుపుతుంటాయి (యాడెడ్ షుగర్). అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదేనీ ఓ ఆహార ఉత్పత్తిలో ఉండే మొత్తం కేలరీల్లోనే యాడెడ్ షుగర్ 10 శాతానికి మించి ఉండరాదని సూచించింది. యూకె శాస్తవ్రేత్తలు అయితే దీన్ని 5 శాతంగానే సూచించారు.
యాడెడ్ షుగర్ అంటే సహజసిద్ధంగా లభించే చక్కెర కాకుండా, మనం టీలో, కాఫీలో, వంటకాల్లో విడిగా కలుపుకునే చక్కెర. రెడీమేడ్ ఫుడ్, ఇతర ఆహార పదార్థాలలో కలిపి చక్కెర అని అర్థం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫారసు ప్రకారం ఒక రోజులో పురుషులు అయితే 150 కేలరీలు అంటే 37.5 గ్రాములు లేదా 9 టీ స్పూన్లు చక్కెర వరకు తీసుకోవచ్చు. మహిళలు అయితే ఇది 25 గ్రాములు లేదా 6 టీ స్పూన్లకు మించరాదు. మన భారతీయులు వీటికంటే ఓ ఐదు పది గ్రాములు తగ్గించి తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణుల సూచన.