Others

మోడల్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలో 22 ఏళ్ల కెండల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది. గత పదిహేడేళ్లగా మొదటి స్థానంలో ఉండే జిసెల్ బుండెచెన్ రెండవ స్థానానికి నెట్టేసి జెన్నర్ ప్రధమ స్థానంలో నిలవటం విశేషం. మోడలింగ్ ద్వారా జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదించినట్లు ఫోర్బ్స్ మేగజైన్ వెల్లడించింది.
ఈ ఏడాది కాలంలో ఆమె మోడలింగ్ ద్వారా దాదాపు 22 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ ఏడాది ఆమె ఆదాయం 22 మిలియన్ల డాలర్లు ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన జిసెల్ ఆదాయం 17.5 మిలయన్ల డాలర్లు. మూడవ స్థానంలో క్రిస్సీ టైజన్ 13.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది. కెండల్ స్నేహితురాలైన గిగి హదిద్ 9.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో ఐదవ స్థానంలో నిలిచింది. కార్లే క్లోస్స్ ఏడవ స్థానంలో 9 మిలియన్ డాలర్ల ఆదాయంతో నిలిచింది. కార్లే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆమెకు వివిధ మాధ్యమాలలో దాదాపు 12.6 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆంతేకాదు కార్లే తనకు వచ్చే ఆదాయంతో ఓ ఎన్జీఓ సంస్థను నడుపుతున్నారు. అంతేకాదు 500 పిల్లలను దత్తత తీసుకుని చదివిస్తున్నారు. లూయివెన్ ఎనిమిదో స్థానంలోనిలిచారు. ఆమె ఆదాయం 6.5 మిలియన్ డాలర్లు. ఈసారి ఫోర్బ్స్ జాబితాలో ఉన్న మోడళ్లలో ఎక్కువ మంది సోషల్ మీడియా మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉన్నవారే కావడం గమనార్హం.