Others

ఇల్లాలికి కానుక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీకు ప్రేముందని చెప్పే చిరునవ్వు
సాకుగా తీసుకుని చేశాను లవ్వు
ఎన్ని ముత్యాలు దొరలిపోయాయి నా చెవిలో
కొన్ని అక్షరాలు పొరలాయి ఈ కవిలో

వసంతకోయిలను మరపించే నీ గానం
వెనె్నల చినె్నల సీతాకోక చిలుకలా నీ నేత్రద్వయం
ఎంత వత్తిడినైనా నాలో చేస్తుంది మాయం
సొంత వ్యక్తిలా నీవు చూపే అధికారం
ఎన్నోసార్లు నను తీర్చిదిద్దిన మమకారం
వెనె్నల లోగిలిలో సన్నజాజుల మాలతో
ముక్కుల కోలాటం నీవు వేస్తున్నందుకు కా
ముక్కేపిగానున్న నన్ను శాంతమూర్తిగా తీర్చినందుకు

అమ్మానాన్నలను నాతోపాటు అమృతమూర్తిలా ప్రేమించి
కమ్మని జీవితాన్ని ముద్దుల సంతానాన్నిచ్చినందుకు
నా పుట్టినరోజుకు నా రచనల లైబ్రరీని కానుకగా
ప్రముఖుల రచనలను ఎంచి పదిలంగా పేర్చినందుకు

అందరి భార్యలలా నా కవిత్వాన్ని బోరనక
అందలి లోటుపాట్లను తెలియజేసినందుకు
నిర్బంధంగా మన పిల్లలను ఓ గంట ‘చందమామ’
పుస్తకాలను చదివించి సంస్కృతి నేర్పినందుకు
అందుకో నీవు నా ఇల్లాలిగా ఈ అక్షరం కానుక!

-బి.హెచ్.వి.రమాదేవి