Others

తెలుగు వెలుగు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష భాషణం
మదినిండా మధురభావ భూషణం
పరభాషీయుల నేర్వకాదు భీషణం
సుర స్వర సవ్వడుల భోషాణం

సరిగమ లయల సంగీత సరాగాల
అజంత భాష తెలుగు
భాషలంద భావ సాగరమై భాసిల్లె
తీయదనాల తేనె తెలుగు

రసరాగాల శబ్ద రవళుల రసధుని
సులభ పల్లవి పలుకుల
మురళిగాన సుశ్రావ్య ధ్వని

శిశువులో భావాంకులం తొడిగి జ్ఞాన
సుగంధ పరిమళయ్యే తల్లి భాష తెలుగు
మాతృభాష మాధుర్యాలు
మనసు నిండా వెలుగు

సమగ్ర పారిభాషిక పదకోశ భాండాగారం
మాతృమూర్తి, మాతృభూమి,
మాతృభాష అవ్యాజమైన ప్రేమల మమకారంప్ర
ప్రజ్ఞాపాటవం సృజనాత్మకత
సృజియించును తెలుగు నుడికారం

తెలుగు భాష పద పలుకులో
సౌందర్యశీలత
అక్షర అకార సౌష్టవం అత్యంత
ఆకర్షణీయత

తెలుగు భాషా వాజ్ఞ్మయంలో
పలువురు ప్రాతఃస్మరణీయులు
తెలుగుభాషా ప్రాశస్త్యాన్ని
ప్రపంచానికి ప్రవచించిన అపర ప్రజ్ఞా ధరీణులు

అరువుభాష భావ అభివ్యక్తానికి
అయ్యేను బరువు
పరభాషామోజులో తెనుగును
తేలిక చేసి తీయకు పరువు

తెలుగు శబ్ద శ్రవణంలో
మకుటమయ్యే మాధుర్యం
ఆనందానుభూతిలో ఓలలాడించే
సహజ సౌందర్యం

-యాదయ్య కొప్పోలు 9494273703