Others

పిచ్చివాడిలో భగవంతుడ్ని చూశాడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది 2002 సంవత్సరం. డిసెంబర్ 31వ తేదీ రాత్రి. నూతన సంవత్సర వేడుకలను యువతీ యువకులు హోటళ్లలోనూ, పబ్‌లలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. బెంగళూరులోని తాజ్ హోటల్‌లో పనిచేసే నారాయణా కృష్ణన్ హోటల్‌లో వండాల్సిన వంటలన్నీ వండేసి తన ఇంటికి బయలుదేరాడు. నారాయణా కృష్ణన్ వండిన వంటకం రుచి అమోఘం అని ప్రసిద్ధి. అతని వంటల రుచి చూసిన స్విట్జార్లాండ్‌లోని ఓ హోటల్ వారు అతనికి లక్షల్లో జీతం ఇస్తాం రమ్మన్నారు. మరో వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోతున్నాడు. ఎప్పటిలాగానే డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఇంటికి బయలుదేరాడు. అతను రోడ్డుదాటుతుంటే ఓ దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా అతనిలో ఏడుపు కట్టలు తెంచుకు వచ్చింది. ఓ పిచ్చివాడు. ఆకలికి తాళలేక తన మలాన్ని తానే తింటూ కనిపించాడు. ఆ చెఫ్‌కు దుంఖః ఆగలేదు. వెంటనే హోటల్ లోనికి పరుగెత్తుకుంటూ వెళ్లి వేడి వేడి ఇడ్లీలు ఐదింటిని తీసుకువచ్చి ఆ పిచ్చివాడి ఎదుట పెట్టాడు. వాటిని చూడగానే ఆ పిచ్చివాడు మలాన్ని వదలేసి ఆబగా ఇడ్లీలు తిన్నాడు. అతను తాగటానికి మంచినీళ్లు ఇచ్చాడు. మంచినీళ్లు తాగిన తరువాత ఆ పిచ్చివాడు నవ్విన నవ్వు ఎలా ఉందంటే.. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి నవ్వు వలే ఉన్నదని అనుకున్నాడు.
ఈ సంఘటన అతని జీవితానే్న మార్చేసింది. పదంకెల జీతాన్ని వద్దనుకున్నాడు. చెఫ్ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు. బట్టలు సర్దుకుని తన సొంత ఊరు అయిన మధురైకి వెళ్లిపోయాడు. తండ్రితో తాను ఏమి చేయదలుచుకున్నాడో చెప్పాడు. ఆ తండ్రి సైతం అడ్డుచెప్పలేదు. కొడుకు చేయబోతున్న పనికి పొంగిపోయాడు. ఆ రోజు నుంచి ఆ తండ్రీ కొడుకులిద్దరూ ప్రతిరోజూ వేడి వేడి ఆహార పదార్థాలు వండి వీధులు వెంట తీసుకువెళ్లి ఎక్కడ పిచ్చివాళ్లు కనిపిస్తే వారికి పెట్టడం ప్రారంభించారు. ఇది ఏదో ఒక్క పూట కాదు. రోజుకు మూడుసార్లు వండి వేడివేడిగా ఐదువందల మంది పిచ్చివాళ్లకు పెడుతున్నారు. కేవలం పిచ్చివాళ్లనే ఎందుకు ఎన్నుకున్నావు అని అడిగితే.. మామూలు భిక్షగాళ్లను పట్టించుకునే వారు చాలామంది ఉన్నారు. కాని ఇలాంటి పిచ్చివాళ్లను ఎవరు పట్టించుకుంటారు. వారిని దగ్గరకు తీయాలంటేనే భయపడతారు. అందుకే వీరిలోనే ఆ భగవంతుడ్ని చూస్తూ.. సేవ చేస్తున్నాను అని బదులిస్తాడు నారాయణ కృష్ణన్. ఈ యువకుడికి 2010లో అమెరికాలో 200 మంది ప్రముఖులు పాల్గొన్న సభలో ‘‘రియల్ హీరో ఆఫ్ ది వరల్డ్’’ అవార్డు బహుకరిస్తున్నపుడు ఆ వేదికపై ఈ యువకుడు ఇలా అంటాడు. ‘‘నేను ఇలా సేవ చేస్తున్నాను అంటే నా తండ్రి అందించిన ప్రోత్సాహమే, చేయూతే కారణం’’ అని బదులిచ్చాడు. మరి ఆలోచించండి.