Others

పటాన్ని దాటిన చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా..
మెడలో వేలాడే దునిమిన దుర్జనుల పుర్రెల పూమాలని
చేతిలో హెచ్చరికల ప్రతీకలా పట్టుకున్న ఒక త్రిశూలాన్ని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా..
ధైర్యం ఎగరేసిన పతాకలా పైకొచ్చిన ఎర్రెర్రని నాలుకని
కోపం రగిలించిన దీపాల్లా మండే చూపుల నేత్రాలని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా
జూలు పట్టుకు సింహాన్ని నడిపించే బొమ్మల ఆత్మస్థైర్యాన్ని
కాళ్ళక్రింద నొక్కిపెట్టిన రాక్షస దేహాన్ని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా
బలికి తెగిపడ్డ అమాయక మేకపిల్ల తలకాయలని
నిప్పుల గుండాలమీంచి నడిచి ఆవిరులుకక్కిన అరికాళ్ళని
ఎన్నాళ్లనుంచో చూస్తూనే ఉన్నాం కదా
పూనకంతో ఊగిపోతూ ఉద్రేకపడిన ఉద్వేగాలని
బతుకు జాతరలో కదిలిన బాధల కన్నీటి కడవలని
‘సురవర పోషిణి దుర్ధర దుర్షిణి దుర్ముఖ మర్ధిని హర్షరతే..’
లోకాన్ని శ్లోకాలతో నింపినా శోకం తీరనే లేదు కదా తల్లీ
పటాన్ని దాటి చిత్రం పైకొచ్చినపుడల్లా.. చూసాం..
ఆదిశక్తి అవతారమొకటి కదం తొక్కే దృశ్యాన్ని..
ఝాన్సీ రాణిలా... రుద్రమదేవిలా.. మగువ మాంచాలలా
మరోసారి పటాన్ని దాటిందట.. చత్రం ఇపుడిపుడే..
కలకత్తా వీధుల్లో కీచకుడి పీచమణిచిన మోనా
పూనాలో మృగాడిని జుట్టుపట్టుకు ఉతికేసిన దుర్గ
ఆర్టీసీ బస్సులో ఆకతాయికి దేహశుద్ధి చేసిన దేవిక
వీడియోలలో ఇంటింటా చేస్తున్నారిప్పుడు వేడుక.
పంచాలి ఈ దృశ్యాలని పదిమందికీ ప్రసాదంలా
ఊరేగించాలి ఈ ఉద్యమ ఉత్సాహాన్ని ఊరూరా..
చైతన్యం నిండిన హృదయాలతో కదం తొక్కుతూ
పటాలు దాటుకుని కదిలొస్తారిక.. బాలికలే కాళికలై!