Others

ఏటిఎంలో ఎలుకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామెత మార్చేయ్యాలి- ఇల్లు కొత్త అయితే ఎలుకలు కొత్తా అని కాదు- ఎటిఎం కొత్తదైతేనేమ్? ఎలుకలకీ కొత్త కాదు. ఖజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో ఒక ఎటిఎం కౌంటర్‌లో కరెన్సీ నింపడానికి వెళ్లిన సిబ్బంది- పరీక్ష చేద్దామని కార్డు పెట్టి చూశారు. షాక్ తిన్నారు. కరెన్సీ నోట్ల బదులు నోట్ల ముక్కలు వచ్చాయి. తెరచి చూశారు. ఒక మూషిక రాజము తాపీగా కరెన్సీ నోట్లను ఆరగిస్తూ కనపడ్డది. గుండె ఝల్లుమంది.. ఈలోగా చిన్న చిన్న ముక్కల తుక్కు క్రింద కొరికిపోస్తున్న మరో ఎలుక కూడా దర్శనమిచ్చింది. సాధారణంగా చిట్టెలుకలు పాత న్యూస్‌పేపర్లని ప్రాక్టీసు కోసం కొరికి కొరికి తుక్కు క్రింద పోసేస్తాయి.. కానీ ఇక్కడ ఒక ఎలుకల జంట- హాయిగా వెచ్చగా ఎటిఎం పెట్టెలో చాలాసేపటినుంచి శృంగార కాలక్షేపం చేస్తూన్నట్లు- కరెన్సీకి నోట్ల తుక్కు ఒక్కటే కాదు- ఎలుక గొద్దెలు కూడా సాక్ష్యం చెబుతున్నాయి- మనం ‘స్వాహా చేసేశామ్’ అంటారు అనుకుంటూ సదరు సిబ్బంది జంట దీన్ని వీడియో తీసుకున్నారు.. మొత్తం ఇరవై వేల డాలర్లు విలువ చేసే కరెన్సీని అవి చెల్లకుండా కొరికేశాయి. ఎలుకలు స్మార్ట్ అంటారు కానీ వాటిని ఆరగించే పాములు ఇంకా గడుసు.. ఎలుకల కోసం ఎటిఎంలు దూరరాని చోటులు ఏమాత్రం కావు కనుక అక్కడ దొరికితే ఓ ఎలుకని ‘బ్రేక్‌ఫాస్ట్’గా ఆరగించాలని- ప్రొద్దుటే ఎటిఎం విజిట్స్ చెయ్యొచ్చు.
‘మార్నింగ్ వాకింగ్ స్నేక్స్’- ఇంగ్లాండ్ నైరుతి ప్రాంత కౌంటీ ‘డోర్సేట్’లో ఒక ఏటిఎం కౌంటర్‌లో కాష్ కోసం వచ్చిన ఒక బామ్మగారు కౌంటరుమీద ప్రాకుతూ చెకింగులో నిమగ్నమై వున్న నాలుగడుగుల నల్ల నాగును చూసి పరుగో.. సరే, నిపుణులు వేంచేశారు.. ఇది మన పాము కాదు- కాలిఫోర్నియా నుంచి ఎవరో తెచ్చుకున్న పెంపుడు పాము అని అమెరికన్ స్నేక్ అంటూ ముక్కున వ్రేలేసుకున్నారు! దొంగలే కాదు ఎలుకలు, పాములు కూడా వుంటాయ్- మన దేశంలో ఏటిఎంలలోనైతే ఈమధ్య ‘నో క్యాష్’ బోర్డులే ఎక్కువగా కనబడుతున్నాయని నిత్య నూతన వార్త!
దుబాయ్ వెళ్లిన చాయ్ కొట్టు జంట!
విజయన్ (67), మోహనా (65) ఆ ఇద్దరు ‘ఆరోహా’ అనే ట్రావెల్స్ కంపెనీ ఆహ్వానంమీద దుబాయ్ వెళ్లి విఐపి లెవెల్ పర్యటన ముగించుకు వచ్చేశారు ఈమధ్య. ఆ ఇద్దరు ఈపాటికే పద్దెనిమిది దేశాలు అప్పుడూ అప్పుడూ చుట్టివచ్చేశారు. 1998 నుంచి ఈ దంపతులు కేరళలో కోచి నగరంలో బాలాజీ కఫే అనే టీ దుకాణం నడుపుకుంటున్నారు. ఓ చాయ్‌వాలా దేశ ప్రధాని అయిన వార్తలే కాదు- వేరే ఆస్తి పాస్తీ లేని పేద జంట కూడా ఇండియన్ టీని బడుగు వర్గాలకి ‘చాయ’ (కేరళలో అలాగే అంటారు) గా అమ్ముతూ ఇప్పటికి పద్ధెనిమిది- బ్రిటన్, ఫ్రాన్సు, ఆస్ట్రియా, ఈజిప్టు, యుఎఇ, సిట్జర్లండ్ వగైరా చుట్టి వచ్చారు. కమ్మని తేనీరు కలిపి ఆప్యాయంగా అందించడం తప్ప వేరే విద్యలు రాని విజయన్‌కి వాళ్ల నాన్నగారు దేశంలోని దేవాలయాలన్నీ తన చాయ్ కొట్టుతో తీసుకుపోయి చాయ్ అమ్ముకుంటూ దర్శించాడు. అతనుకూడా ఆయన కొడుకుని తీసుకుపోయేవాడు- కాని విజయన్ ఓ అడుగు ముందుకు వేసి దూర దూర దేశాలన్నీ చూడాలని కలలుగన్నాడు. ఎవరి సాయం, స్పాన్సర్‌షిప్ లేకుండా మొన్నటికి ఒక్క అమెరికా తప్ప అన్ని దేశాలు చుట్టివచ్చాడు. అతని భార్య మోహనా చేదోడు వాదోడు- గజాల లెక్కన టీ- కాఫీ అమ్మగలరు వీళ్ళు- ‘చేయి ఇలా సాగదీసి’ టీ గ్లాసులోకి దింపితే అదో స్వర్గతుల్య దృశ్యం- అదో అమృత వర్షం పేదలకి. అట్లా చాయ్ అమ్మి రోజుకి ఐదు వందలు ప్రక్కన బెడతారు. నెలకింత అని చీటీ వేస్తారు. పొదుపుగా విదేశీ యాత్రల కోసం పైకం దాచి - ప్లస్ ఓ బ్యాంకు లోను కూడా పెడతారు. దేశాలు తిరిగివచ్చి చేసిన అప్పును కేవలం సమోసాలు, చాయ్, కాఫీలు అమ్మి తమ చిన్ని బాలాజీ కాఫీమీది ఆర్జనమీద తీర్చేసి మళ్లీ ‘చలో’ అంటారు ఈ జంట- అయితే వాళ్లకి సంసారాలు లేవు అనుకోవద్దు- గల్ఫ్ న్యూస్‌కి ఇంటర్వ్యూలో చెప్పాడు విజయన్- మా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లుచేశాం- శశికళ, ఉషారాణి - వాళ్ళ పిల్లలు హ్యాపీగా వున్నారు. ఈసారి, దుబాయ్ లాంటి అద్భుత నగరానికి మా టీ కష్టం ఆర్జనతోనే మనుమల్ని, కూతుళ్ళని తీసుకుపోయి చూపించాలి అన్నాడు విజయన్. మోహన కేరళ శైలీలో చీర ధరిస్తుంది. అతను కేరళ స్టైలులో ధోతీ ధరిస్తాడు. పల్లెటూరు దంపతులులాగే గత ఇరవై ఏండ్లుగా పాలస్తీనా సహా ఎన్నో దేశాలు పర్యటించారు. ఏడు వింతలూ చూసి వచ్చారు. ఎలాగైనా అంటార్టికాకి వెళ్లాలి అన్నది బామ్మగారు మోహనా.. దక్షిణ ధృవ నుంచి మన ఉత్తర దిక్కు ఎలా వుంటుందో చూస్తుందిట. జై బోలో చాయ్‌కీ-

veeraji.pkm@gmail.com