Others

మనకి మనమే రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిశక్తి.. దైవీ శక్తిగా భావించడం అనాదిగా వస్తున్నదే. సృష్టి ఆరంభమే స్ర్తిశక్తితో జరిగింది అనేది మన హైదవం చెబుతుంది. అసలు ఆడదే అన్నింటి ఆధారం అనే నిత్యసత్యాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రాచీనకాలంనుంచి భారత దేశ వ్యవస్థలో స్ర్తిలది గౌరవప్రదమైన స్థానమే. భారతదేశంలో స్ర్తి మూర్తులను ‘లక్ష్మి, సరస్వతి పార్వతి ..’ ముగ్గురమ్మలుగా ఆరాధిస్తారు. అనసూయ, సుమతి, అహల్య, ద్రౌపది, కుంతి వంటి పతివ్రతామ తల్లులు, గార్గి, మైత్రేయి, ఉభయ భారతి వంటి విదుషీమణులు, ఝాన్సీ లక్ష్మీబాయి,రాణి రుద్రమదేవి వంటి వీరనారులు వారి వారి కీర్తి ప్రతిష్టల కారణంగా నేటికీ స్మరణీయులు, ఆరాధ్యులు అయిన వారందరూ స్ర్తిలే. స్ర్తిలకు గౌరవం ఇవ్వడం అనేది సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఉన్నదే అని చెప్పవచ్చు.
శతాబ్దాల తరబడి దాస్యం, మూఢాచారాలు అనే పరదాలతో అణచివెయ్యబడింది స్ర్తి. దానికి కారణం ఆనాటి పరిస్థితులే. విదేశీయుల దండయాత్రలు.. వారి దురాగతాలు.. ఇలాంటి వన్నీ స్ర్తి బలైంది.అదిగో అప్పుడే స్ర్తిలను రక్షించేవారు అనే వారుబయలుదేరారు. మీ రక్షణ చేస్తాం అంటూ కొన్ని కట్టుబాట్లను పెట్టారు. సమాజాభివృద్ధికోసం కదా అని స్ర్తి తలూపింది. ఆ కట్టుబాట్లే, ఆ సదాచారాలే రాను రాను కాలానికి అనుగుణంగా మారకుండా దురాచారాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసినా స్ర్తి వెనకబడేట్లుచేసేసాయి.
ఏశక్తి అన్నా అణిచివేస్తే తిరిగి వేయి రెట్లుగా విజృంభిస్తుంది. అట్లాగా నేడు స్ర్తిశక్తి వేయివిధాలుగా మేల్కొంది. అన్ని రంగాల్లో స్ర్తి తానున్నాననే కాదు తానే ముందున్నానని నిరూపించింది. కాలగమనం స్ర్తిని వెనుకబడేట్లు చేస్తే చక్రభ్రమణంలో అదే కాలం కలికికి పెద్ద పీట వేసింది.
నేడు అబలగా ఉన్న స్ర్తిలకు ఆసరాగా అటు ప్రభుత్వమూ ఇటు స్వచ్చంద సంస్థలూ ముందుకు వచ్చి వారిలో అణగారిపోయి ఉన్న శక్తిని తట్టిలేపుతున్నాయి. మాయమాటలకు లొంగిపోయి మానాన్ని కోల్పోయిన వారికి కాని, ధనపరంగానో, మానసిక పరంగానో శారీరిక పరంగానో ఏదైనా నష్టాన్ని వాటిల్లినప్పుడు ఆసరా ఎన్నో పథకాలు ఉన్నాయి. నేడు ఆ యా పథకాల గురించి ప్రతివారికి తెలియ చెప్పే సాధనాలు కావాలి. అవి ప్రసార ప్రచార మార్గాలు వాటికి అనువైనవి. నేడు కాలుష్యాన్ని వెదజల్లే నెట్‌జన్ల నుంచి కాపాడుకోవాల్సిన అవసరమూ కనిపిస్తుంది. కంటికి కనిపించినట్లుగా భ్రమింపచేస్తూ వాట్స్ అప్, ఫేస్‌బుక్‌లు ఇవి కూడా స్ర్తిలల్లో మృదుత్వగుణాన్ని తమకు అనుకూలంగా చేసుకొంటూ స్ర్తిలకు నష్టాన్ని కలిగిస్తున్నారు. ఇలాంటి వాటికి బలవకుండా మనలను మనం రక్షించుకుందాం. నాడే కాదు నేడు కూడా స్ర్తి శక్తి మహోన్నతమైనదే అని చాటి చెబుదాం.

- గౌరి