Others

అంతర్వాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం కాళ్ళకు కట్టిన
చక్రం!
ప్రమేయం లేని పెత్తనాలకు
బలిపశువు!
పొగడ్తల గాలానికి చిక్కిన
చేపపిల్ల!
దోచుకోబడిన స్వప్నాలకు
తీపిగుర్తు!
బాధ్యతల బందిఖానాలో
జీవితఖైదీ!
త్యాగాల కొమ్మపై
తనవారికై పండిన ఫలం!
పట్ట్భద్రురాలైనా
వంటింటి రాజ్యానికి పట్టమహిషి!
ఎన్నో కన్నీటి నదులు దిగమ్రింగినా!
ఎండిపోని సంకల్ప సముద్రం.
అన్ని జయాల వెనుక నీవున్నావంటూనే
అతనిలోని అహాన్ని త్రుంచే విజయ విలాసం!

-డేగల అనితాసూరి