Others

శివోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రదోష తాండవ శివుడు
ఆనంద నిలయుడు
నాట్య నాయకుడు
లాస్య లావణ్యుడు
భవసాగరం దాటించు భవుడు
భావనాతీతుడు భావరమ్య రమణీయుడు
శివ, శివా
హర, హరా
జలపాతాలు పొంగిదూకేను
భూమాత జలగంగ జోరులో
పులకించిపోయేను
డమరుకం మ్రోగగా
మూడు లోకాలు నీకు మ్రొక్కేను
అర్థనారీతత్వ
త్రిపురాంతకుడు తాను
తానే శివం అన్న
త్రిపుర సుందరి ఆమె
శశిశేఖరుడు, శిరోగంగబద్ధుడు
నందివాహనుడు, సర్పమోహితుడు
తాను అదుముకున్నది బూడిద
కోరి కొలిచే వారి కొంగు బంగారం
సర్వాంతర్యామీ నీవు నిరాకారుడవు
నిరాడంబరుడవు

- ఎ.ఎస్. ప్రభాకర్