Others

తెలుగందాలు ఎనె్నన్నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రియమైన శర్వాణి, ఉభయకుశలోపరి.
మీ అత్తగారు ఆరోగ్యం ఎలా ఉంది. మీ అమ్మగారు బాగున్నారా... నాలుగు లైన్లు క్షేమసమాచారాలే ... ఎంతో అప్యాయంగా పేరుపేరునా అడిగింది.
అసలు విషయం... చాలా ఏళ్లక్రితం మనం ఈ ఉత్తరాల కోసం ఎంత ఎదురుచూశామో నీకు గుర్తుందికదా. ఇపుడు నాకు మళ్లీ ఉత్తరం రాయాలనిపించింది. దానికి కారణం నాకు సాప్ట్‌వేర్ ఉద్యోగమే అయినా ఇంటినుంచి పని చేసే వెసలుబాటును కలిగించింది మా కంపెనీ . దాంతో నేను పని త్వరగా చేసేసుకొన్నాను. కాస్త సమయం చిక్కింది. ఎప్పుడూ ఫోనులో మాట్లాడుకోవడమే కదా. అని నీకు లెటర్ రాద్దామనుకున్నాను. కంప్యూటర్ ముందు కూర్చున్నాను. కాని నాకెందుకో ఇలా పెన్ చేతిలో పట్టుకొని ఉత్తరం రాయాలనిపించింది. రాస్తుంటే కలిగే ఆనందం నీవు ఈ ఉత్తరం చదువుతూ కూడా పొందగలవు అనిపించింది. మనం కంప్యూటర్ లో మెయిల్‌లోను తెలుగులోనే మాట్లాడుతున్నాం కాని ళఖఖ అని రాస్తున్నాం కాని మన తెలుగులో ఛక్కని అక్షర సంపదతో మన భావాలను తెలుపుతుంటే ఎంత ఆనందంగా ఉందో రోజు ఇంగ్లీషులిపిలో రాస్తుంటే రాని ఆనందం తెలుగు లిపిలో రాస్తుంటే వస్తోంది. మన భాషోద్యకారులంతా కలసి మాతృభాషను కనీసం పదవ తరగతి వరకు నిర్బంధం చేయాలని అంటున్నారట. కాదు ఇంటర్, డిగ్రీలే కాదు ఉన్నత చదువులు, అన్నీ తెలుగులోనే ఉంటే ఎంత బాగుండు. మనం ప్రపంచదేశాలన్నింటినీ కలిపే ఇంగ్లీషు అనే మాధ్యమం లాగా మన తెలుగును చేస్తే ఎంత బాగుండు కదా. దానికి మనవంతు కృషి చేద్దామనిపించింది. అప్పుడప్పుడూ ఇలా ఉత్తరాలను తెలుగులో రాసుకొందామా శర్వాణీ... ఈ వర్క్ ఎట్ హోమ్ అనే వెసలుబాటు బాగానే ఉంది. కాని నాకెందుకో ఇల్లే ఆఫీసు అయిపోయిందా అనిపిస్తోంది. హాయిగా ఇంట్లో ఇంకేదైనా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దానికి నీ స్పందన కావాలనిపించి ఇలా రాస్తున్నాను. నీవు కూడా ఆలోచించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూనే కాస్త ఆనందం మరికాస్త వెచ్చదనం అంటే తెలుసుకదా కాసిని డబ్బులు ఎలా పొందగలమో ఆలోచించి చెబుదూ.. నీ ఉత్తరం కోసం
ఎదురుచూసే
నీ పద్మ
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003