Others

కష్టంలోను, ఓర్పులోను ఇద్దరూ సమానమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులకు రామాయణ మహాభారతాలు ప్రామాణ గ్రంథాలు. ఆ కథలలోని వ్యక్తులను ఆదర్శ పురుషులుగా మనం భావిస్తాము. అదేవిధంగా స్ర్తి పాత్రలను ఆదర్శ మహిళలాగా మనం కీర్తిస్తాము.
ఈ విధంగా చూచినపుడు రామాయణంలో సీత భారతంలో ద్రౌపది ఆదర్శ మహిళలుగా కనిపిస్తారు. వీరిరువురి మధ్య కొంత సామ్యం ఉన్నది. అది యాదృచ్ఛికం కావచ్చు. సీత జనకునకు నాగేటి చాలులో లభించిన అయోనిజ. ద్రౌపది యజ్ఞకుండం నుండి ఉద్భవించిన మహాసతి! ఇరువురూ భర్తల ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాధలు అనుభవించినవారే! సీతామాత దీర్ఘకాలం పతీ వియోగం భరించింది. మరి ద్రౌపది భర్తల చర్యల కారణంగా తన శీలానికి భంగం కలిగే స్థితిని తట్టుకొనగలిగింది. శ్రీరామచంద్రుడు మానవ రూపంలో వున్నందువల్ల అమ్మ ఆ బాధలకు గురి అయింది. ఇది స్వాభావికమేనని చెప్పుకోవాలి.
సీతను రాములవారు ఏదో ఒక నెపం కారణంగా పరిత్యజించవలసి వచ్చింది. అటువంటి పరిస్థితి ద్రౌపదికి ఎదురుకాలేదు. సీతామాత చివరకు అగ్నిలో పడి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొనవలసి వచ్చింది. అంతే. ఆ పిమ్మట ఒక్కటంటే ఒక్కక్షణం కూడా రాముని సాన్నిధ్యంలో లేదు. భూమాత తన బిడ్డను తనలోకి తీసుకొని వెళ్లిపోయింది. కష్టాల విషయానికి వస్తే ద్రౌపదికి తక్కువ ఏమీ లేదు. వస్త్రాపహరణ ప్రయత్నం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంవలన రక్షించబడ్డది. లాక్షాగృహంలో దహించపోవలసిన ద్రౌపది, అయిదుగురు భర్తలు కూడా సుఖంగా క్షేమంగా బయటపడడం జగద్వితితం! ద్రౌపది విషయంలో చరమాంకంలో పాండవులు వరుసగా స్వర్గారోహణ పర్వం చేరుకోగా ఆవిడకూడా ఆ విధంగానే అంత్యకాలాన్ని భరించింది. మరిది అయిన లక్ష్మణునిచే సీతమ్మ తల్లిగా భావించబడ్డది. ద్రౌపది విషయంలో ఆమెకు మరుదులంటూ ఎవరూ లేరు.
ఏది ఏమైనా భారతదేశంలో అతి ప్రభావశీలులైన మహిళలుగా సీతమ్మ, ద్రౌపదీమాత కీర్తిగాంచారు, వనె్నకెక్కారు కూడా!

- కాకుటూరి సుబ్రహ్మణ్యం