Others

మాతృసూక్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మగుండె గుప్పెడే ఎప్పుడూ
అది ఆకాశానంతా నింపుకుంది.
పొత్తిళ్ళ లోపల ఊయలలూగే ఊఊల సవ్వడి ఆమెకే వినిపిస్తుంది.
చిన్నారి కన్నాయి కదలికలకు
విచ్చుకున్న కనురెప్పలు నవ్వుతుంటాయి!
అది అమ్మకు మాత్రమే తెలుసు!
తువ్వాయి కనురెప్పల చప్పుడు వెన్నకరిగి వెలుతురైనప్పుడు-
కన్న మనసు కరుణాసాగరవౌతుంది.
ఆ అనుభూతులు అమ్మ ప్రకంపనలకు తెలుసు!
అమ్మా! నను కనటానికి మమతల గొడుగైనావు!!
నా రాకకు ఎదురుచూచే ఆనందాల హరివిల్లయినావు.
నీ ఒక్కదానికే తెలుసు, నా పుట్టుక స్ఫటీకరించిన గాజు గోళమని!!
*

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199