Others

శతావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణుడ్ని కన్న దేవకమ్మవో....
క్రీస్తునిచ్చిన మరియమ్మవో...
లాలించే తల్లివో.., పూజించే ‘అమ్మ’వో,

ఓలలాడించే ఆలివో..., శిలలాంటి మనిషిని చెక్కే ఉలివో,
అనురాగం పంచే సోదరివో..., అక్కున చేర్చుకునే ఆశ్రయానివో,
కవ్వించే మరదలివో..., కనికరించే కూతురివో,

ప్రాణంగా ఆరాధించే ప్రేమవో... విరహంతో వేధించే ప్రేయసివో,
నవ్వించే స్నేహానివో... తరిగిపోని వలపు నిధివో,
నడిపించే పాదానివో... బ్రతుకుని దిద్దే అక్షరానివో,

నేర్పించే పాఠానివో..., ఆలాపించే గేయానివో,
తలుచుకునే పరిచయానివో..., పిలుచుకునే బంధానివో
తలొంచుకునే పరిణయానివో.... మలుచుకునే మనసువో...,

విరిసే పువ్వువో...., నవ్వుల జలపాతానివో,
కురిసి హిమపాతానివో..., విరబూసే వెనె్నల వర్షానివో,
ఎంత వర్ణించినా...., అంతేలేని అందానివో..,

కదిలే మేఘానివో..., కదిలించే రాగానివో...,
గారాల అల్లికవో... బుంగమూతి అలకవో...
దయ చూపే జాలివో.., దారిచూపే వేదానివో...,

రగిలించే దావానానివో..., జ్వలించే శిఖరానివో...,
ప్రమోదాన మురిపించే ప్రతిమవో....,
ప్రకోపాన మండించే ప్రమిదవో...,

ప్రాణం పోసే వైద్యానివో..., లాజిక్కుల వకీలువో..,
న్యాయమూర్తివో..., వ్యోమగామివో...,
శిక్షకురాలివో..., రక్షకురాలివో...,

తూటాల్లాంటి మాటవో...,మిఠాయిలాంటి పాఠవో,
ఓ మగువా నీ తెగువ ఓ నిప్పుకణం
నీ ప్రేమ జీవనాధారం... సృష్టికి నీవే ఆధారం

నీ స్ఫూర్తి అఖండ దీప్తి..,
కాళివో..., భద్రకాళివో.., సహస్రగళాల ఓంకారానివో..,

శత హస్తాల దేవతవో,
శతావతారానివో,
ఓ మహిళా... నీకు వందనం,

ఆడజన్మ... నీకు అడుగడుగునా వందనం.
పాదాభివందనం...

-సి.హెచ్.అరుణ్‌కుమార్ 8106863054