Others

ఆనందమానందమాయె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇష్టాలను, కోరికలను త్యాగం చేస్తే అక్షయమైన ఆనందాన్ని పొందవచ్చునన్నది గౌతబుద్దుని ఉవాచ. మళ్లీ ఆ బుద్ధ భగవానుడే ‘కోరికలే సకల దుఃఖాలకు మూల కారణమని’ అభిప్రాయాన్ని తెలియజేశాడు. కానీ సహజంగా ఆశాజీవి అయిన మానవుడు ఇష్టాలనూ, కోరికలనూ త్యజించడం అంత సులభ సాధ్యమైన పనికాదు. అందునా నేటి పోటీ ప్రపంచంలో సాటివాని ఎదుగుదల చూసి సహించలేని బలహీనమైన మనసుతో ఏ కోరికా లేకుండా జీవించడం దుర్లభం! అలా అని ఆనందమయమైన జీవితాన్ని విషాదమయం చేసుకోవడం కూడా వివేకవంతమైన పనికాదు. మరి- అందుబాటులోనే ఉంటూ- అందని చందమామలా సుదూరమవుతూన్న ఈ ఆనంద తీరాన్ని చేరుకోవడం ఎలా? ఈ సందర్భంగా- మనమంతా స్మరించుకోవలసిన మాట అబ్రహం లింకన్ చెప్పిన- ‘మనం చేసే పనిలో ఎంత అభిరుచిని కలిగివుంటామో, ఎంత ఏకాగ్రచిత్తంతో ఆ పని చేయగలుగుతామో- అవి అంత ఆనందదాయకమై మన మనసులో అమితానందాన్ని నింపుతుంది’’ అనే మాట గుర్తు చేసుకోవాలి. అంటే మన ఆనందాన్ని మనం ఇష్టం చేసుకొని, చేసే పనిలో పొందగలుగుతామని ఆ మహనీయుని మహదభిప్రాయం! ఏ పనీ చేయకుండా నిర్లిప్తంగా- నిరుత్సాహంగా కూర్చోవడం ఎప్పటికీ ఆనందమయ జీవితాన్ని అందించలేదు. కనుకనే పనిలోనే పరమాత్ముడున్నాడని- పనియే దైవమని భావించేవారి చెంత ఎప్పుడూ ఆనందం కొలువుంటుంది. అటువంటివారి గుప్పిట్లో ఆనందం- అప్రయత్నంగా నెలవవుతుంది. అవధుల్లేని ఆ ఆనందం అంతర్లీనమైన జీవనవాహినిగా ప్రవహిస్తుంది. అందుకే కీ.శే. అబ్దుల్ కలామ్‌గారు ‘‘కలుల కనడం మానకండి. కానీ ఆ కలలను సాకారం చేసుకొనే మార్గాలు వెతకండి’’ అని అందంగా చెప్పారు. కాబట్టి గొంతెమ్మ కోరికలు- పెంచుకొని ఆ కోరికలు తీరలేదని మనోవ్యధ చెందడం ఎప్పటికీ ఆనందాన్ని అందివ్వదు. మన పరిధిల్లో- పరిమితమైన కోరికలు పెంచుకుని- వాటిని తీర్చుకునే దారుల్లో కృషి చేయడం- వాటిని నెరవేర్చుకోవడం- అనిర్వచనీయమైన ఆనందాన్నిస్తుంది. అటువంటి ఆనందమే ఉల్లాసవంతమై ఉత్సాహానికి ఊపిరిపోస్తుంది. అది సంతృప్తి నిండిన సంతోషం. ‘ఆనందం’ ఎప్పటికీ మానసికమే! అది ఎవరికి వారు అనుభవించదగిన స్వర్గానుభూతి! అటువంటి అనిర్వచనీయ ఆనందాన్ని పొందాలంటే- ముందుగా మన మనసుకు ప్రశాంతత కావాలి. మనకు మనమే కర్తవ్య బోధకులుగా మారిపోవాలి. అప్పుడే నిండైన ఆనందం మన సొంతమవుతుంది. అయితే మనం చేసే ఆ పని ద్వారా- వ్యక్తిగతమైన గొప్పతనాన్ని కోరుకోకుండా - ఆదర్శవంతంగా ఆ పని చేయగలగాలి. నీతిగా, నిజాయితీ సదాశయంతో- అంకితభావంతో చేసే పని ద్వారా అంతటా ఆనందం వెల్లి విరుస్తుంది. ఆ ఆనందమే సమాజ శ్రేయస్సుకు సోపానమై శోభిల్లుతుంది! అందుకనే అనుక్షణం ఆనందానుభూతిలో లీనమై కర్తవ్య దీక్షకు పూనుకోవడమే మన తక్షణ కర్తవ్యం! సో.. బి అలెర్ట్!!

-మరువాడ భానుమూర్తి