Others

సుమధుర రామాయణం.. (అరణ్యకాండ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

188.విల్లు చేబూని వెను వెంట వచ్చుచున్న
రామచంద్రుని మాయ మృగమ్ము చాల
దవ్వు గొంపోవ నలిగి శ్రీరఘువరుండు
నిశిత శరమును సంధించి లేడినేసె

189.సాయకమ్మున లేడి రూపమమ్ము వీడి
యసురు డీల్చుచు ‘‘హా సీత లక్ష్మ’’ణ యని
రాము నెలుగున నార్తనాదమ్ముజేసె
నా స్వరము విని సీత యారాటపడుచు

190.వింటివా లక్ష్మణా నిను బిలిచె నన్న
కీడు వాటిల్లె రాక్షస వ్యాఘ్రములతో
రాజ వృషభుడు యాసురీమాయ జిక్కి
మదిని గుందుచు భూపతి యుండెనేమో

191.అప్పుడు సౌమిత్రి భీతి జెందకుము తల్లి
దేవ గంధర్వ పన్నగ దానవులలో
నీపతి నెదిర్చి జీవింప నెవ్వ డోపు
మాయ మృగమును జంపి వేగమ్మె వచ్చు

192.అగ్రజుని మాటల దలంచి లక్ష్మణుండు
బోక నిలచిన కోపించి భూమిజాత
వంచకుడవీవు నీ పాప చింత దెలిసె
తమ్ముని వలె నటించు శత్రుండవీవు

193.ఇందులకె నీవు మా వెంట వచ్చినావు
అన్న మరణింప ననుపొందు దుష్టబుద్ధి
తోడ రామచంద్రుడు ప్రాణ హీనుడైన
సీత మరణించు నుత్తర క్షణము నందె

194.సీత బల్కిన దుర్భాషణములు కర్ణ
శూలములవలె నవి తాక లక్ష్మణుండు
తల్లడిల్లుచు తల్లి! సుమిత్ర వలెనె
నిన్ను భావించి గొల్పుచు నుంటి నమ్మ

195.ఇంత పరుషపు మాటలతోడ నన్ను
దుఃఖ పెట్టితి వింక దేవతలె నీకు
రక్ష యనిబల్కి యరిగెను లక్ష్మణుండు
నన్న గనుగొన జానకి నొంటి వీడి

196.లక్ష్మణుండటు జనగనె రావణుండు
కపట సన్యాసి వేషంబు బూని సీత
కడకు వచ్చెడు సమయము నందు తరులు
గదలవయ్యె సమీరంబు మెదలదయ్యె

197.వాకిట నిలచి ప్రాణేశ్వరు రఘురాము
రాక కొరకు తపించెడు రాజముఖని
జేరి రావణుడెవ్వరవీపు బాల
శ్రీసతివొ రతివో దెల్పు చంద్రవదన

198.అట్లు బల్కు భిక్షకునకర్ఘ్య పాద్యాస
నంబులిచ్చి పూజ సల్పి సీత
నేను దశరధేశు కోడల రాఘవు
సతిని మీరలెవరొ దెల్పు డార్య

199.నన్ను రావణుడందురు నళిన నేత్ర
అసురకుల చక్రవర్తివి శివుని సఖుడు
యక్ష పతి కుబేరుండనుజుండు నాకు
మూడు లోకంబు లందునా కెదురు లేదు
నిన్ను గని మన్మధ శరబద్ధుండనైతి

200.దేవ గంధర్వ పన్నగ జాతులందు
నిన్ను బోలెడుసుందరీమణులు లేరు
నాకు గలవేల పత్నులలోన నిన్ను
నగ్ర మహిషిగ జేసెద నిందువదన

201 అట్లు ప్రేలెడు కపట సన్యాసి జూచి
దుష్టచిత్తుడ నన్ను రాఘవుని సతిని
నీగతి నవమాన పరిచి బల్క నీదు
వంశనాశన కాలము వచ్చెనింక

202 నన్ను గొరెడు వాడవా నిశిచరుండ
సింహముతో నక్క పరిహాసమునకు దిగెనె
రఘుకులేశుని కులసతిన్ గోరి రామ
విశిఘ వహ్నిని బడి నశించెదవు సుమ్ము

టంగుటూరి మహాలక్ష్మి