Others

సృజనను పెంచుకునే కాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి పిల్లల్లో ఆటలు పాటలు తగ్గిపోయాయి. హోమ్‌వర్క్‌ల బిజీ, ఎదగాలనే తపన పెరిగిపోతోంది. చిన్న పిల్లల్లో సృజన పెరిగి తల్లిదండ్రులకి పేరు తేవాలనే తపన పెరిగిపోయింది. అందుకే వేసవి శిక్షణా శిబిరము. ఆట స్థలాలు లేని కానె్వంట్స్ మేడల్లో, ఏసి రూముల్లో బాల్యాన్ని బంధించి మేధస్సు పెంచాలనే ధ్యాసతో బాల్యాన్ని గడిపేస్తున్నారు. పిల్లల్లో జనరల్ అవేర్‌నెస్ ఉండటంలేదు. సెల్‌ఫోన్ పట్టుకొని వాళ్ళ ధోరణిలో వాళ్ళు బ్రతికేస్తున్నారు.
కళలు నేర్పిస్తే కనీసం వేసవిలో సృజన పెరుగుతుంది. శరీరక వ్యాయామం తక్కువ, మానసిక వ్యాయామం ఎక్కువ. బలమైన ఆహారం కంటే ఆధునిక పిజ్జాలు, పఫ్‌లకి ఇష్టత ఎక్కువ. కామిక్ బుక్స్, కథల పుస్తకాలు తక్కువ హోమ్ వర్క్‌లు ఎక్కువ. సృజన తక్కువ, బట్టీవేత ఎక్కువ. కథలు చెప్పే అత్తలు, అమ్మమ్మలు లేరు. ఎవరి పనులు వారివి. వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు. తమ పేరెంట్స్ తప్ప బయటి వ్యక్తులతో కలివిడితనం తక్కువ. ఇలా ఎక్కువ తక్కువతో బేరీజు వేసుకుంటే గత జీవితం కంటే పిల్లల్లో ఒంటరితనం ఎక్కువ. సెల్‌ఫోన్, నెట్‌ల చెలిమి ఎక్కువ.
అందుకే వారికి వేసవి శెలవులలో సంగీతం, డ్రాయింగ్, పెయింటింగ్, నృత్యం, పేపర్ ఆర్ట్స్ వంటి వాటిల్లో ప్రావీణ్యత వచ్చేలా తక్కువ టైములో ఎక్కువ కళ వచ్చేలా క్రాష్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఇది ఎల్‌కెజి నుంచి 5 వరకూ పిల్లలకి ముఖ్యంగా నేర్పించి తీరాలి. ఇదీ కొంచెం జ్ఞానం తెల్సిన పిల్లలయితే వయొలిన్, వీణ, తబలా, మృదంగం, ఫ్లూట్ వంటి వాయిద్యాలు నేర్పించవచ్చును. ఇంకొంచెం జ్ఞానం తెలిసిన పిల్లలయితే షటిల్, టేబుల్ టెన్నిస్, క్రికెట్, చెస్, క్యారమ్స్, బాస్కెట్‌బాల్, త్రోబాల్ వంటి అవుట్‌డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ నేర్పించవచ్చును. జీవితంలో కళలవల్ల జ్ఞాపకశక్తి, మేధావితనం పెరుగుతాయి. ఈమధ్య వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి 4 ఏళ్ళ పిల్లాడు పద్యాలు, 5 ఏళ్ళ పిల్లవాడు డ్రాయింగ్, పెయింటింగ్, 12 ఏళ్ళ పిల్లాడు 108 పాటలు 6 గంటలలో పాడటం, దేశాల పేర్లు చెప్పడం వంటి ఎన్నో అంశాలలో ప్రావీణ్యత చూపించి అవార్డులు తెచ్చుకుంటున్నారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో దానిలో ప్రావీణ్యత వచ్చేలా ఈ వేసవి సెలవులలో శిక్షణ ఇప్పించాలి. ఆ తరువాత స్కూల్స్, హోమ్‌వర్క్స్‌తో బిజీ. అదీగాక వేసవి ఎండలకి దూరంగా ఉంచడం ఆరోగ్య రీత్యా మంచిది. సంగీతం సింపుల్‌ఫై చేసి ముప్పై రోజుల్లో చక్కగా పాడే విధానం, 20 రోజుల్లో డ్రాయింగ్, పెయింటింగ్ వంటి ఎన్నో సృజనాత్మక కళలు, వ్యర్థ పదార్థాలతో అందమైన కళాత్మక వస్తువుల తయారీ నేర్పించవచ్చును.
ముఖ్యంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి. వారికి ఆ క్లాసులకి తీసుకెళ్లి, తీసుకురావడం, కావాల్సిన పరికరాలు, వస్తువులు కొనివ్వడం తప్పనిసరి. దీనికి కొంత కష్టపడాలి. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులిద్దరికి వీలు కాదు అనుకోకుండా కొంత టైమ్ పిల్లలకోసం వెచ్చించాలి.
కొందరయితే అన్నీ కావాలి, అన్నీ నేర్చుకుంటామంటారు. వారికి అన్నీ నేర్పించేలా టైము అడ్జెస్ట్ చేయాలి. రిక్షాలు, ఆటోలు, ఆయాలు ఇలా ఎవరికో ఒకరికి పురమాయించి పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆ తరువాత సండే వారికి గుర్తుండేలా, మళ్లీ రివిజన్ చేస్తూ తల్లిదండ్రులు ఇంటివద్ద నేర్పించడమో, సండే క్లాసులకి పంపడమో చెయ్యాలి.
ఒక్క చదువే కాదు జీవితంలో ఏ రంగంలో ఉపాధి వస్తుందో తెలియదు. ఈ కళల్లో పిజిలు, డిప్లొమాలు కూడా ఉన్నాయి. ఆ రంగంలో ఎదగాలనుకున్నవారికి డిగ్రీ, పిజి, పిహెచ్‌డి చెయ్యడానికి అవకాశాలున్నాయి. కొన్ని దూర విద్య ద్వారా కూడా చదవవచ్చును. ప్రాక్టికల్ క్లాసులకి వెళ్లవచ్చును. ఇంచుమించు ప్రతి టౌన్‌లోను ఈ అవకాశాలున్నాయి. కనుక బాలమేధావులుగా తీర్చిదిద్దేవారికి ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇచ్చేవి ఈ వేసవి శిబిరాలు. బెస్ట్ ఆఫ్ లక్!

-ఎన్.వాణీప్రభాకరి