Others

ఆరోగ్య ప్రాప్తిరస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అంతా వృథానే.. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ప్రతిరోజూ మనం నిద్ర లేచిన దగ్గర నుంచీ ఉరుకుల పరుగులతో జీవనం సాగిస్తున్నాం. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక అసలు ఉండనే ఉండదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వాటిని ఆచరించడం వల్ల కొద్దిగానైనా మేలు జరుగుతుందని చెబుతున్నారు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నిపుణులు. అవి మీకోసం..
* సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.
* నిద్ర లేవగానే పరగడుపున రెండు, మూడు గ్లాసుల నీరు తాగాలి. ఈ నీరు గోరువెచ్చగా ఉంటే మరీ మంచిది.
* ప్రతిరోజూ కనీసం పదిహేను నిముషాల పాటు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి.
* వ్యాయామం తరువాత ఉసిరి లేదా త్రిఫలచూర్ణంతో కూడుకున్న నీటిని సేవించాలి.
* వారానికి ఓ రోజు ఉపవాసం ఉండటానికి ప్ర యత్నించాలి. ఈ సమయంలో కేవలం నీరు, పండ్లను మాత్రమే తీసుకోవాలి.
* టీ, కాఫీ, పొగాకు, ధూమపానం, మద్యపానం, గుట్కా వంటివాటిని మానేయాలి.
* తీసుకునే భోజనంలో పులుపు, మిర్చి, మసాలాలు, వేపుడు పదార్థాలు తక్కువ లేదా లేకుండా చూసుకోవాలి.
* భోజనం చేసేటప్పుడు వౌనంగా ఉండాలి.
* భోజనంలో సలాడ్, ఋతువులను అనుసరించి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులూ ఉండేలా చూసుకోవాలి.
* మొలకెత్తిన గింజలను తరచూ తీసుకునేప్ర యత్నం చేయాలి.
* పంచదార, ఉప్పు, మైదాలను తక్కువగా తీసుకోవాలి.
* ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్నానం చేయాలి. దీంతో శరీరం శుభ్ర మవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడానూ..
* ఉదయం అల్పాహారం తప్పనిసరి. అయితే ఇది తేలిగ్గా జీర్ణమయ్యేదిగా ఉండాలి.
* నిద్ర కు కృత్రిమ సాధనాలను ఉపయోగించకూడదు. అలాగే ప్రతిరోజూ కనీసం ఏడు గంటలపాటు నిదురించాలి.
* ఉదయం, రాతి పడుకునే ముందు తప్పనిసరిగా దంతావధానం చేయాలి.
* సమయానుసారం భోజనం చేయాలి. రాత్రి పడుకునే సమయానికి రెండు గంటల ముందే భోజనాన్ని పూర్తిచేయాలి.
* ముందురోజు ఆహారపదార్థాలు మిగిలిపోయాయని మరుసటిరోజు వాటిని వేడిచేసి తీసుకోకూడదు. పండ్లు తినేటప్పుడు కూడా అవి తాజాగా ఉన్నాయా లేదా అని పరిశీలించి తీసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పండ్లను అస్సలు తీసుకోకూడదు.
* మానసిక ఒత్తిడి పెరిగితే పలు జబ్బులకు ఆహ్వానం పలికినట్లే.. అందుకని ఒత్తిడిగా అనిపించినప్పుడు ఇష్టమైన సంగీతం, లేదా పుస్తకాన్ని చదవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
*