Others

అనంత విశ్వ ప్రయాణ బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా అమ్మా
విద్యావంతం, యశోవంతం,
లక్ష్మీవంతం భవతు!
అని ఆ ఆదిదేవుని బీజమంత్రాలను
నాచే దిద్దించి,-
‘‘ఓం నమశ్శివాయ-సిద్ధం నమః’ అని
అక్షర చైతన్యాన్ని
నా లక్ష్య సాధనగా చేసి సిద్ధిప్రదం చేసిన
వాగ్దేవతవు!
శూన్య గగనంలో లయమైన అక్షరపర బ్రహ్మాను,
ఆత్మసాక్షాత్కరం పొంది, భూమిపైకి రప్పించి,
భూమండల మంతా అక్షర బీజావాపనం
చేయాలని,
‘‘అష్ట్ధ్యాయి పాణిని మహర్షి’’
‘‘వాగర్ధా వివసంపృక్తౌవాగర్ధ ప్రతిపత్తయే’’-
వాక్ అర్ధ స్వరూపులైన,
ఆదిదంపతులను ఆవాహన చేసి,
అంతర్లీనమైన అక్షర బీజాలకు
జవం- జీవంతో, పురుడు పోయటానికి
తప్ఫఃలాన్ని ధారపోసి,
ఢమరుక నాదాలను మనోఫలకంపై నింపి
‘అ,యి,ఉన్’ అక్షరవేదాలను బీజాక్షరాలుగా
నా ఔదల ధరించే భాగ్యాన్ని
ప్రసాదించావుగా తల్లీ!!
వాగ్విభవ సర్వసాక్షాత్కారం అందించి,
మాననీయత్వం
నాలో స్వరాలుగా మార్చి, శ్రీమాతా!
అక్షర బిక్షను అక్షయంగా అందించావు!
ఓంకార ప్రణవాక్షరంతో పురిటి పొత్తిళ్ల నుండి
పరిమాళాక్షరమైన
అనంత విశ్వప్రయాణ బాటసారిగా,
మారటానికి నీవే నా మార్గదర్శినివి!

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199