Others

శిరోజాలు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరోజాలు ఒత్తుగా ఉండాలే గానీ, వాటితో అందాలొలికే ఎనె్నన్ని ఆకృతులనైనా ఆవిష్కరించే వీలుంది. ఎప్పుడూ ఒకే మాదిరి కాకుండా సమయం, సందర్భం, అభిరుచుల మేరకు మహిళలు పలురకాల హెయర్ స్టయిల్స్‌తో కనువిందు చేయవచ్చు. ముఖం, నుదురు, మెడ ఆకారాలను బట్టి అనువైన హెయిర్ స్టయిల్‌ను ఎంచుకుంటే అందం మరింతగా ఇనుమడిస్తుంది. కోల ముఖం, గుండ్రని ముఖం, చతురస్రాకార ముఖం, పొడవైన మెడ, చిన్న మెడ, వెడల్పాటి నుదురు.. వంటి విషయాలను చూసుకుని అందుకు తగ్గట్టుగా శిరోజాలంకరణ ఉంటే ఎంతో బాగుంటుంది. లేజర్ కట్, వీ కట్, యూ కట్, స్టెప్ కట్, పోనీ టెయిల్ వంటి విభిన్న హెయిర్ స్టయిల్స్‌పై నేటితరం అమ్మాయిలు మోజు పడుతుంటారు. ఇంకా చిగ్‌నాన్, వేవ్స్, స్ట్రెయిట్, స్లీక్ హెయిర్, నేచురల్ వంటి స్టయిల్స్ కూడా ముఖానికి కొత్త అందాన్ని తెస్తాయి. హెయిర్ స్టయిల్ ఏదైనా- అది ముఖం, శరీరాకృతికి సరిపోయేలా ఉండాలి. కొత్త ఫ్యాషన్లు, సరికొత్త స్టయిల్స్‌పై తగిన అవగాహన కోసం హెయిర్ డిజైనర్ల సలహాలు తీసుకోవడం మంచిదే.