Others

పలా జో(ష్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన స్టైల్ - పలాజో. నడుము దగ్గర నుంచి పొడవుతో పాటు వెడల్పు కూడా పెరుగుతూ పాదాల వరకు ఉండే పలాజో ప్యాంట్ స్టైల్ కొత్త హంగులతో మళ్లీ ఇపుడు తెరమీదకి వచ్చేసింది. సంప్రదాయ శ్రేణిగా భావించే ధోతీకి ఇపుడు మళ్లీ ఆదరణ లభిస్తోంది. దీనికి జతగా పొట్టి టాప్, కుర్తీలను ఎంచుకోవడం మామూలే. అయితే ఇవి కుచ్చిళ్లు, అడుగున వెడల్పుగా ఉండటం ఎగుడు దిగుడు డిజైన్లతో వస్తున్నాయి ఇప్పుడు. ఇవి క్రాప్, కాప్తాన్, ఎసెమెట్రికల్ టాప్‌లకు చక్కగా నప్పుతాయి.
అమ్మాయిలు ట్రెడిషన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. కొత్త ఫ్యాషన్స్‌ను అంతే ఆదరిస్తారు. నయా ట్రెండ్స్‌ను అనుసరించడంలో ఇతర దేశాల ఫ్యాషన్ ప్రియులతో సిటీ అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే వారికి ధీటుగా నిలబడతారు.
ఒక్క ఫ్యాషన్ రంగమనే కాదు, అన్నిట్లోనూ వారు ముందుంటున్నారు. ఒకప్పుడు ఒక్క పలాజోనే తీసుకుంటే జతగా పొట్టి కుర్తీ, ఒంటికి అతుక్కునే టాప్‌లను ఎంచుకునేవారు. ఇపుడతా తీరు మారింది. పొడవాటి కుర్తాలకు మడమ వరకూ ఉండే పలాజోని జతచేయడం ఫ్యాషన్. ఇవి వేసుకున్నపుడు కాస్త ఎత్తు తక్కువగా కనిపించినా వాటికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. పలాజోలకు సరిజోడైన కుర్తీలు ధరిస్తే కళగా మెరిసిపోవడమే కాదు ఆధునికతా ఉట్టిపడటం ఖాయం.
20వ శతాబ్దంలో పుట్టిన పలాజో ట్రెండ్ భారతీయ సంప్రదాయ వస్తధ్రారణకు తోడై చాలా అందంగా కని పిస్తోంది.
స్ట్రయిట్ కట్ సల్వార్, స్టైలిష్ అనార్కలీ, సింపుల్ కాటన్ కుర్తా- ఇలా వేటిమీదకైనా పలాజో ప్యాంట్లు సరిపడతాయి. 1930లో ఫ్రెంచ్ విమెన్ ఫ్యాషన్ డిజైనర్ కోకో చానెల్ పలాజో ప్యాంట్ స్టైల్‌ను డిజైన్ చేసినప్పటినుంచి ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ వచ్చారు. 1960కి ముందు కేవలం విశ్రాంతి సమయంలోను, సాయంత్రం పార్టీలకో, బయటికి వెళ్ళేటప్పుడు ధరిస్తుండేవారు. 1970ల్లో ఫ్యాషన్ ప్రపంచంలో ఒక సంచలనంగా నిలిచిన పలాజో స్టైల్ 1980ల్లో కనుమరుగైనా, కొత్తతరం మళ్లీ ఈ స్టైల్‌కే ఓటేశారు. అప్పటినుంచి రకరకాల హంగులతో వస్తున్న పలాజీలు ఇపుడు కొత్త కొత్త ప్రింట్స్, డిజైన్లతో మరింత కలర్‌ఫుల్‌గా కనువిందు చేస్తున్నాయి. అందంగా ఫ్యాషనబుల్‌గా ఉండడమే కాదు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. చూడడానికి బెల్‌బాటమ్ ప్యాంటులా అనిపించినప్పటికీ దీని స్టైలే సెపరేటు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి