Others
జయజయ వినాయకా..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 September 2018
-పుష్యమీ సాగర్ 90103 50317
విఘ్నాలని విచ్చిన్నం చేసే శుభాల దేవుడుకి పండుగ
వాడవాడలా పందిళ్లలో
జీవితకాలానికి సరిపడే ఆనందాన్నిచ్చిన
వినాయకునికి నమోవాకాలు
భాద్రపదంలో ప్రకృతి
తోడుతో మనిషి వివేకాన్ని
తట్టిలేపే జ్ఞాన కన్ను
సమస్త కార్యాలకి
ఆది గురువై శుభాలని కలిగించే
బహు పనిమంత దేవుడు
తలపెట్టే ప్రతీ కార్యం
అవిఘ్నంగా జరుగుతూ
ప్రకృతిని, మనిషిని
ఒక్కటి చేసేదే వినాయక చవితి
సమస్త లోకాలకి
అభయం ఇచ్చే ఓ మా వినాయకా
మీకివే మా వందనాలు
అజ్ఞాన తిమిరాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న
అల్ప మానవులకి దారి చూపించు
కాలుష్యాన్ని రూపుమాపి వేనోళ్ళ పొగిడేట్టు
ప్రకృతి హిత చవితిని అందరూ ఆచరించాలి
ప్రతి ఏటా కష్టాలని, నష్టాల్ని తొలగిస్తూ అందరి మనస్సులో వెలిగిపోవాలని ప్రార్థిస్తూ నమో వినాయక...!