Others

కొత్త కొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితరం అమ్మాయిలు ఎన్ని రకాల చెవిపోగులున్నా ప్రత్యేక సందర్భాల్లో ఒకసారి ధరించినవి, మరోసారి ధరించడానికి ఇష్టపడరు. ఎన్ని రకాల చెవిపోగులున్నా, నెక్లెస్‌లు ఉన్నా ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి అమ్మాయిలకు. చాంద్ బాలీలు, బుట్టలూ, పోగులూ, జుంకీలు, నెక్లెస్‌లు, వంకీలు.. ఇలా అన్నీ రకరకాల డిజైన్లలో చేయించుకోవాలని ఉంటుంది. కానీ అన్ని రకాలు, అంత బంగారంతో చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇది అందరికీ సాధ్యం కాదు కూడా.. అందుకే నేటి నగల డిజైనర్లు నెక్లెస్‌లకు వాడే లాకెట్‌లను వంకీలుగా, నాగారంలా వాడుకునేట్టు తయారుచేస్తున్నారు. అలాగే నాలుగు నుంచి ఆరు రకాలుగా వాడుకునేలా చెవి లోలాకుల్ని డిజైన్ చేస్తున్నారిప్పుడు. అందులోనూ ఇటీవల చాంద్‌బాలీ, బుట్టా డిజైన్‌లు కలగలసిన చెవిజుంకీలు ఫ్యాషన్‌గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీనివల్ల ఒక్క జత కమ్మలు కొనుక్కుంటే ఒక్క జతతోనే సౌత్ సీ పెరల్, వజ్రం, పచ్చ, కెంపు, నీలం.. వంటి రత్నాలనీ, చాంద్ బాలీల్ని, బుట్టల్నీ.. ఇలా దేనికదే విడివిడిగా తీసి మళ్లీ పెట్టుకునేలా డిజైన్ చేస్తున్నారు. దానితో ఒక్క జతతో ఎలా కావాలంటే అలా డ్రస్సుకు తగినట్లుగా పెట్టుకోవచ్చు. అలాగే ఒక్క నెక్లెస్ కొంటే.. దాన్ని నాలుగు రకాలుగా వాడుకోవచ్చు. ఆ నెక్లెస్‌ను గాజులా, వంకీలా, హెయిర్ పిన్‌లా వాడుకోవచ్చు. ఇలా ఇప్పటి నగల డిజైనర్లు ఒకదానితో నాలుగు నుంచి ఆరు రకాలుగా వాడుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఇంకెందుకాలస్యం.. ఇలాంటివాటిని కొని సందర్భానుసారంగా కొత్తకొత్తగా, ట్రెండీగా మారిపోదాం!