Others

మోడ్రన్ కిచెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లు చిన్నదా, పెద్దదా అని కాకుండా.. ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చునని నిరూపిస్తోంది నేటి ఫర్నిచర్ సెటప్. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది కాదు, ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నదే ముఖ్యం. చాలామంది ఇళ్లల్లో అన్ని గదులకంటే లివింగ్‌రూము, బెడ్‌రూములను చాలా అందంగా అలంకరిస్తారు. వంటగదిని కూడా కొంచెం మోడ్రన్‌గా అలంకరించుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం..
వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగురంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్, గ్రానైట్ టాప్, గ్లాస్ హబ్, బాస్కెట్స్, గ్లాస్ చినీ.. ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్‌ను అందంగా తీర్చుదిద్దుకోవాలనే తపన ఎక్కువైంది. ఆ క్రమంలోనే ఇప్పుడు రెడీమేడ్ కిచెన్‌లు ఆదరణ పొందుతున్నాయి. మహిళలు ఎక్కువ సమయంలో కిచెన్‌లోనే గడుపుతుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనంలో కుటుంబ సభ్యులందరూ కలిసేది కిచెన్ దగ్గరే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే కిచెన్‌కి దగ్గరలోనే డైనింగ్ టేబుల్‌ను ఏర్పాటుచేసుకుంటున్నారు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. సంప్రదాయాల కిచెన్ స్థానంలో మోడ్రన్ కిచెన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హై - ఎండ్ అపార్టుమెంటుల్లో నివసించే వారి దగ్గరి నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటివైపే మొగ్గు చూపుతున్నారు.
మాడ్యులర్ కిచెన్‌లు అందుబాటులోకి వచ్చాక వంటగది రూపమే మారిపోయింది. ఇంటీరియర్ డెకరేషన్‌లో ఇది సరికొత్త మార్పులను తీసుకువచ్చింది. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వంటగది విస్తీర్ణాన్ని బట్టి కిచెన్ క్యాబినెట్‌లను డిజైన్ చేయించుకోవడం వల్ల వస్తువులను నీట్‌గా సర్దుకునే అవకాశం ఉంది. వంటపాత్రలను శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్, కూరగాయలు తరగడానికి గ్రానైట్ టాప్ కూడా ఉంటుంది. హబ్స్‌లో బోలెడు రకాలున్నాయి. గ్లాస్ హబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువమంది ఇప్పుడు గ్లాస్ హబ్స్‌నే ఎంచుకుంటున్నారు. పొగ బయటకు వెళ్లడానికి వీలుగా చినీ ఉంటుంది. ఈ చినీలు కూడా చాలా రకాలున్నాయి. ఇవి వంటగది విస్తీర్ణాన్ని బట్టి ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఇవి నాలుగు వేల నుంచి నలభై వేల వరకు కూడా చినీ ధర ఉంటుంది. గ్లాస్ చినీకి ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఇక వంటసామాగ్రి, పాత్రలు పెట్టుకోవడానికి వీలుగా ఫుల్ అవుట్ డ్రాలు ఉంటాయి. వంట పాత్రలు భద్రపరుచుకోవడానికి అనువుగా షట్టర్స్ ఉంటాయి. మాడ్యులర్ కిచెన్ యాక్సిసిరీస్‌లో చాలా రకాలు వివిధ రంగుల్లో, డిజైన్స్‌లో లభిస్తున్నాయి.
ఈ మాడ్యులర్ కిచెన్లలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే మాడ్యూల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏ మాత్రం డ్యామేజీ కాకుండా సులువుగా వీటిని విప్పుకోవచ్చు. కొత్త ఇంటికి మళ్లీ బిగించుకోవచ్చు. కొన్ని రోజులు అయ్యాక మళ్లీ కొత్త రూపు రావాలనుకున్నవారు కొత్త రంగుల్లో, డిజైన్లలో షట్టర్లను నిర్మించుకోవచ్చు. వీటివల్ల మళ్లీ వీటికి కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్ టాప్‌ను నిర్మించుకున్నవారు కూడా మాడ్యులర్ షట్టర్‌ను కూడా తెచ్చుకుని బిగించుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో విధాలైన సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి. అందుకే చాలామంది ఇప్పుడు మాడ్యులర్ కిచెన్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు.
*