Others

అర్ధ శతాబ్దం తర్వాత.. మళ్లీ ఆ ఘనత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 55 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. కెనడాకు చెందిన డాక్టర్ డోనా స్ట్రిక్‌ల్యాండ్‌కు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది నోబెల్ కమిటీ. భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను గెల్చుకున్న మహిళల్లో డోనా స్ట్రిక్‌ల్యాండ్ మూడోవారు. ఆమె కన్నా ముందు 1903లో మేరీ క్యూరీ, 1963లో మరియా గొప్పొయెర్ట్ మేయర్‌లు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను గెల్చుకున్నారు. రేడియో యాక్టివిటీపై చేసిన పరిశోధనకు గాను మేరీక్యూరీకి నోబెల్ పురస్కారం లభించింది. పరమాణు కేంద్రకాలపై చేసిన పరిశోధనలకు గాను మరియా గొప్పొయెర్ట్ నోబెల్ పురస్కారాన్ని పొందింది.
యాభై ఐదు సంవత్సరాల తర్వాత నోబెల్ పురస్కారాన్ని డోనా స్ట్రిక్‌ల్యాండ్ అందుకోనున్నారు. ఈమె అమెరికాకు చెందిన ఆర్థర్ ఆష్కిన్, ఫ్రాన్స్‌కు చెందిన గెరార్డ్ మోరోతో పంచుకుంటారు. లేజర్ ఫిజిక్స్‌లో చేసిన పరిశోధనలకు గాను ఆమె ఈ పురస్కారాన్ని గెల్చుకున్నారు. ఎక్కువ తీవ్రత కలిగిన లేజర్ పల్సెస్‌ను లేజర్ ఐ సర్జరీ సహా అనేక పరిశోధనల్లో ఉపయోగిస్తున్నారు. దీన్ని డాక్టర్ స్ట్రిక్‌ల్యాండ్ కనుగొంది. ప్రస్తుతం కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ వాటర్ లూలో పనిచేస్తున్న స్ట్రిక్‌ల్యాండ్.. నోబెల్ పురస్కారం వచ్చిన సంగతిని నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఆష్కిన్, గెరార్డ్‌లతో పురస్కారాన్ని పంచుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది.