Others

శ్రీ సాయి దివ్య లీలా విలాసం - మహత్త్వ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీప లీల
దీపం జ్ఞానానికి సంకేతం. బాబా రోజూ మసీదులో అనేక దీపాలు వెలిగించి రాత్రంతా వెలిగేలా చూసేవారు. ప్రత్యేకంగా మనకంటూ ఏ కోరిక లేని యోగిరాజు కేవలం ప్రజల హితవుకోసం మసీదులో రాత్రంతా జాజ్వల్యమానంగా దీపాలు వుంచేవారు. దీనికోసం వ్యాపారుల దగ్గరనుంచి స్వయంగా నూనె అడిగి తెచ్చేవారు. రోజూ ఉచితంగా నూనె ఇవ్వటం ఇష్టంలేని వ్యాపారులు ఒకసారి లేదని చెప్పారు. బాబా ప్రమిదలలో నూనెకు బదులుగా నీరు పోసి వత్తులు వేసి దీపాలు వెలిగించటం, అవి రాత్రంతా వెలుగలు విరజిమ్ముతూ వెలగం చూసి ప్రజలు అబ్బురపడ్డారు. వ్యాపారులు పశ్చాత్తాపంతో శరణువేడారు. ‘నీ దగ్గర ఉంచుకుని లేదని అబద్ధం చెప్పవద్దు. నీకిష్టం లేకుండా ఇవ్వనని మర్యాదగా చెప్పు’. బాబా పూర్ణ దయాళువు. అనేకమంది తమను మోసగించినా, అవహేళన చేసినా, అపకారం తలపెట్టినా ఉపేక్షించక ఉపకారం చేయటం వారి వ్రతం.
ఋణానుబంధం
సద్గురు సాయినాధుని భక్తులవటం ఆయన రక్షణ పొందటం వారితో మనకు గల ఋణానుబంధంవల్లనే జరుగుతుంది. ‘ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను’. ఈ నివేదన సూత్రంలో ఎన్నోసూక్ష్మాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైనా తనకు సమర్పించిన ప్రతీ పైసాకు భగవంతునికి లెక్క చెప్పుకోవాలని, తనకు సమర్పించిన దానికి పది రెట్లు తిరిగి వారికి ఇవ్వవలసి ఉంటుందని బాబా చెప్పేవారు. ఈ రుణం తీర్చుకోవటమనేది బాబా కరుణా కార్యం. ఋణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో, నీ వద్దకు వచ్చిన ఏ ప్రాణినైనా అలక్ష్యం చెయ్యక ఆదరించు. వివిధ ప్రాణుల రూపంలో నేనే ప్రపంచమంతటా సంచరిస్తాను. కుక్కలేమి, పిల్లులేమి, చీమలేమి అన్నీ నేనే. ఆకలిగొన్న ఏ ప్రాణికి ఆహారమిచ్చినా అది నాకు పెట్టినట్లే. ఈ గుర్తింపుతో నడుచుకునేవారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. భోజనం చేసేముందు సమృద్ధిగా ఇంటి ముందు అన్నం విడిచిరా. ఏది తింటోంది అన్నది ఆలోంచవద్దు. ఇలా చేస్తే రోజూ లక్షలాది అతిథులను ఆచరించినట్లే!
దక్షిణ పరమార్థం
మొదట్లో సాయి మహారాజ్ ఎవరినుండీ దక్షిణ తీసుకొనేవారు కాదు. అయినా అప్పుడప్పుడు కాశీ అనే భక్తుని నుండి ఒకటో రెండు పైసలు తీసుకునేవారు. సాయి తన నుండి దక్షిణ తీసుకోవాలని కోరుకునేవాడు కాశి. ఒక్కోరోజు బాబా తన దగ్గరనుండి దక్షిణ తీసుకోకపోతే బాధపడేవాడు. ఇలా బాధపడటం పరమార్థానికి మంచిది కాదనేవారు సాయి. నాకు ఇచ్చే శక్తి ఉంది అన్న అహంభావం ప్రవేశిస్తుంది. భక్తుని పరమార్థానికి ప్రమాదారి అయిన విషయాన్ని పెరికిపారవేయాలని బాబా సంకల్పం. భక్తుల అహంభావాన్ని తగ్గించటం కోసమే బాబా దక్షిణ లీల నడిపేవారు. ఒక్కోసారి ఒకే భక్తుని నుండి అనేక పర్యాయాలు దక్షిణ కోరేవారు. ఒక్కోసారి ఇచ్చినా స్వీకరించేవారు కాదు. ఇచ్చే శక్తి నాకుందన్న అహంభావం తల ఎత్తినపుడు బాబా అనేక పరీక్షలకు గురిచేసేవారు. అపుడు దెబ్బమీద దెబ్బలా అతనినే మళ్లీ, మళ్లీ దక్షిణ ఇమ్మనేవారు. దైవముకు గురువుతో ఐక్యమవటానికి మనస్సు పలుమార్పు సమర్పించుకోవాలని భావం. భగవంతుడు కృపతో మనకు ప్రసాదించినదే మనపై అనుగ్రహంతో గురువుగా సాక్షాత్కరించినపుడు ఆయనది ఆయనకే సమర్పిస్తున్నామనే భావమే ఉండాలి. ‘యస్యానుగ్రహ మిచ్ఛామి తస్య సర్వం హరామ్యాహమ్’- నేను అనుగ్రహించదలచినవాని సర్వము హరింతును’ అంటారు బాబా. మనిషి తీసుకొనతగని, వుంచుకొనతగని ధనము సంహరింపబడుట దక్షిణ అంటే.
ఔషధసేవ
బాబా షిరిడీ చేరిన కొత్తలో ప్రజలకు ఔషధాలు ఇచ్చేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పేవారు. ఎవరినుండి ఏమి తీసుకునేవారు కాదు. కొన్ని సందర్భాలలో తామే స్వయంగా వెళ్లి రోగులకు సేవ చేసేవారు. ఆయన ఇచ్చే ఔషధాలు సామాన్యంగా ఇచ్చే ఓషధులకు విరుద్ధంగా ఉండేవి. ఎవరన్నా సాయి ఈ మందు ఇచ్చారని, తామే స్వయంగా తయారుచేసుకుని వాడితే నయం కావటానికి బదులు వికటించేది. మళ్లీ సాయిని శరణు వేడుకుంటే తగ్గిపోయేది. సాయి స్పర్శ, సంకల్పమే ఓషధమని అపుడు గ్రహించేవారు.
నా గురువు నా శిరస్సు ముండనం చేయించి రెండు పైసలు దక్షిణ అడిగారు. ఒకటి నిష్ఠ మరొకటి సబూరి. గురువుపై పరిపూర్ణమైన స్థిర విశ్వాసం నిష్ఠ. సబూరి సహనం చివరి వరకు ఓపిక పట్టి కార్యాన్ని సాధించటం. నా పంచేంద్రియ సామర్థ్యాన్ని నా చూపులో కేంద్రీకరించి నిద్రాహారాలు మాని రాత్రింబవళ్ళు నా మనోదృష్టిని నా గురువుపై నిలిపాను. ఆయనే నా ధ్యానమూర్తి. ఆయనను తప్ప అన్యులను సేవించి ఎరుగను.

యర్రమిల్లి విజయలక్ష్మి