Others

పోషకాల నిధి బాదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ నట్స్‌గా చెప్పే బాదాంలో మంచి గుణాలెన్నో ఉన్నాయి. వీటిలో తల్లిపాలల్లో ఉండే ప్రొటీన్లు కూడా ఉంటాయి. బాదాంలోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కోలన్ క్యాన్సర్‌ను నివారిస్తాయనీ, పిత్తాశయంలోని రాళ్లను తొలగిస్తాయన్నది పరిశోధనల ద్వారా తేలిన నిజం. రోజూ కాసిన్ని బాదంపప్పులను ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు. వీటివల్ల పొట్టలో మంచి బాక్టీరియా పెరిగి తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో శాచ్యురేటెడ్ కొవ్వుల శాతం కూడా తక్కువే. బాదాంలో ఎక్కువగా ఉండే ‘విటమిన్ ఎ’ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మసౌందర్యాన్ని పెంచుతుంది. దీనిలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదయమే నాలుగు నానబెట్టిన బాదాంలను తీసుకుంటే మెదడు చాలా చురుగ్గా పనిచేసి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని మన పూర్వీకులు ఎప్పటినుండో చెబుతున్నమాట.
వంద గ్రాముల బాదాంలో..
శక్తి : 576 కిలో కేలరీలు
పిండిపదార్థాలు: 21.69 గ్రాములు
కొవ్వులు: 49.42 గ్రాములు
శాచ్యురేటెడ్ : 3.7 గ్రాములు
మోనో అన్‌శాచ్యురేటెడ్: 30.889 గ్రాములు
పాలీఅన్‌శాచ్యురేటెడ్: 12 గ్రాములు
ప్రొటీన్లు: 21.22గ్రాములు
విటమిన్ ఇ: 26.2 మిల్లీ గ్రాములు
కాల్షియం: 264 మిల్లీ గ్రాములు
ఐరన్: 3.72 మిల్లీ గ్రాములు
మెగ్నీషియం: 268 మిల్లీ గ్రాములు
పొటాషియం: 705 మిల్లీ గ్రాములు