Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ - లోని
శవర్ణం- సుఖబీజం. అది ఆనందకారణం.
రం వర్ణం- అగ్ని బీజం అది తేజఃకారణం
ఈ వర్ణం- తేజఃపుంజాత్మక చిచ్ఛక్తిరూపం.
అందుకని వాల్మీకి మహర్షి సుందరకాండలో అక్కడక్కడ స్వామిని శ్రీమాన్ అంటారు.
ఆ మాటకిది అర్థం అని ఆ సమయంలో మనం భావన చేయాలి.
స్వామి మహేంద్రగిరి మీద నిలిచి ఉన్నాడు.
ప్రమాణానికి చాలనంత శరీరాన్ని పెంచి ఉన్నాడు.
తనతోటి వానరులు
తన జ్ఞాతి వానరులు- అంతా మహేంద్రగిరి పాదంలో ఉన్నారు.
తలపైకెత్తి చూస్తున్నారు. స్వామి ముఖాన్ని చూడలేకపోతున్నారు.
తమ దైన్యాన్ని వదలలేకపోతున్నారు. స్వామి వాళ్ళను చూసేడు.
అప్పటివరకూ తనంతటి వాళ్ళు. ఇప్పుడు-
తనముందెంతటి వాళ్ళ? తను వారికి ధైర్యం చెప్పాలి.
దైన్యాన్ని పోగొట్టాలి. అందుకని వారిముందు ప్రతిజ్ఞచేస్తున్నాడు.
యధారాఘవ నిర్ముక్త శ్మర శ్మ్యసన విక్రమః
గచ్ఛేత్త ద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితామ్.
వాయువేగ పరాక్రమంతో రామచంద్రమూర్తిచేత విడిచిపెట్టబడిన బాణంలా రావణ పాలితమైన లంకను చేరుతాను. అదీ ప్రతిజ్ఞ. ఇది ప్రయాణ విధానం. ఈ బయలుదేరటంలో కర్తృత్వాభిమానం లేదు.
అంటే-
ఈ ప్రయాణం నాది- ఈ సామర్థ్యం నాది.
ఈ సముద్రాన్ని లంఘింపగల మతి నాది.
అనే అహంకారం లేకుండాగా-
ఈ ప్రయాణం రామచంద్రుని కొరకు.
ఈ సామర్థ్యం ఆయనది-ఈ ధైర్యం ఆయనది.
నేను కేవలం నిమిత్తాన్ని.
ఆయన చేత ప్రయోగింపబడిన బాణానికి కర్తృత్వమేమిటి- అని అనుకొని కర్తృత్వ నిరాశనం చేసికొని హనుమ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో స్వామి-
సుపర్ణమివ చాత్మానం మేనే సకపికుంజరః
ఇక్కడ వాల్మీకి మహర్షి స్వామిని కపికుంజరుడన్నారు. కపిత్వం చాంచల్యానికి ప్రతీక.
కుంజరత్వం నేలను అంటిపెట్టుకొనని జీవించే విధానానికి ప్రతీక. అంటే చంచలమైన మనస్సు కేవల భౌతికమైన జీవితాన్ని గడిపే వానరావస్థలో ఉన్న స్వామి నేను సువర్ణుడను అని అనుకొన్నాడట. సువర్ణుడంటే గరుత్మంతుడు. అంతేకాదు ఆత్మ. స్వామి ఈ వేళ ఆత్మతత్వాన్ని ఎరిగిన బ్రహ్మవేత్త. అందుకని కూడా కపికుంజరుడు. కపి అంటే బ్రహ్మతత్త్వాన్ని పానం చేసినవాడు.
కుంజరుడంటే- ఆ స్థితిలో భూమియందు సంచరిస్తూ ఉన్నవాడు.
అంతేకాదు-
గరుత్మంతుడు అమృత సాధనను చేసినవాడు.
అదికూడా మాతృదాస్య విమోచన రూపమైన పదార్థం కొరకు.
కనుక- సీతను చూసి రావడమంటే అమృత దర్శనాన్ని చేసికొని రావడమే ఆ తల్లి అమృత స్వరూపిణి.
అమృతాది మహాశక్తి సంవృతా అని ఆ దేవికి పేరు. అదే సీతాదేవి స్థితి కూడా.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ