Others

హితవాక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉపాయమాస్థితస్యాపి నశ్యస్త్యర్థాః ప్రమాద్యతః
హన్తి నోపశయస్థోపి శయాలుః మృగయుః మృగాన్
అది ‘మాఘ’ మహాకవి కట్టిన అక్షర మణితోరణం..
‘శిశుపాలవధ’ కావ్య ప్రాంగణంలోని దృశ్యమిది-

అది ద్వారక. శ్రీకృష్ణలీలకు మనోహర వేదిక. అప్పుడే నారదుడు వచ్చి వెళ్లాడు. ‘‘దుష్టుడైన శిశుపాలుణ్ణి త్వరగా తుదముట్టించాలి’’ అని మహేంద్రుని సందేశాన్ని కృష్ణుని చెవిలో ఊది వెళ్లాడు. ఇంతలో ఇంద్రప్రస్థపురంనుండి ధర్మజుని ఆహ్వానం అందింది, రాజసూయయాగానికి రమ్మని. కృష్ణుడు సందిగ్థావస్థలో పడ్డాడు. ‘‘శిశుపాలుణ్ణి వధించడానికి చేది దేశం వెళ్ళాలా? లేక ఆప్తులు జరుపుకునే రాజసూయానికి వెళ్ళాలా?’’- వెంటనే రహస్య సమావేశం జరిపాడు అన్నయైన బలరామునితో, పినతండ్రి, ప్రధాన సచివుడైన ఉద్ధవునితోను. ఉద్ధవుడు చేసిన ఉపదేశమాలికలోని ఒక పువ్విది.. పువ్వులో పరిమళించిన ధర్మ హృదయమిది..
‘‘ఉపాయం కలవానికైనా అజాగ్రత్తవలన ప్రయోజనాలు నశించిపోతాయి. అది వివేకవంతునికైనను తప్పదు. అంటే-ఏకాగ్రత ముఖ్యమన్నమాట! నిద్రాళువైన వేటగాడు చాటుగా మాటువేసి ఉన్నను జంతువుల్ని వేటాడలేడు గదా! అంటే నిద్ర వాని దిట్టతనాన్ని నిష్ఫలం చేస్తుంది. అలాగే నిపుణుడైనను జాగ్రత్త లేక లక్ష్యసాధకుడు కాలేడు’’.

భారతీయమార్గము మాసప్రతిక (1987 జనవరి)నందు ప్రచురితమైన హితవాక్యాలు-వ్యాఖ్యాత-డి.ఎన్.దీక్షిత్. ప్రచురణ- శ్రీ శంకర సేవాసమితి (రిజి), శ్యామలానగర్ -గుంటూరు-522066.

-వ్యాఖ్యాత:డి.యస్.దీక్షిత్